YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సాహిత్యం

హైదరాబాద్ బుక్‌ఫెయిర్

హైదరాబాద్ బుక్‌ఫెయిర్

పుస్తకాలను అపురూపంగా ప్రేమించేవారు, ప్రపంచవ్యాప్తం గా కొత్తగా విడుదలైన పుస్తకాల కోసం ఎదురుచూసే వారికో సం పాత, కొత్త పుస్తకాల ప్రపంచంగా ఈ నెల 18 నుంచి 28 వరకు హైదరాబాద్ బుక్‌ఫెయిర్ మీ ముందుకువస్తుంది. దేశంలోనే రెండోస్థానం హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు ఉన్నది. ఇది హైదరాబాద్‌లో జరుగుతున్న 31వ జాతీయపుస్తక ప్రదర్శన. అన్నిరంగాలకు, అన్నిశాస్ర్తాలకు సంబంధించిన పుస్తకాలు, అన్నిభాషల పుస్తకాలు దొరుకుతాయి.

ముక్తి నుంచి విముక్తి ఉద్యమాల వరకు సాహిత్యం లభిస్తుంది. పుస్తక ప్రేమికులకు, సృజనకారులకూ ఇది పుస్తకాల పండుగ. ప్రపంచ విజ్ఞానాన్ని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరాపార్కు) దగ్గరకు తీసుకవచ్చి మీ చేతికందించే ప్రయత్నం చేస్తున్నాం. సమాజ మార్పునకు, సమాజాల పునర్నిర్మాణాలకు ప్రధాన పనిముట్టయిన పుస్తకాన్ని దర్శించండి. ఆరోగ్యవంతమైన సమాజానికి పుస్తకమే ప్రాణం. మంచి పుస్తకాలు ఉత్తమ సమా జ నిర్మాతలు. నవతకు, సమతకు దారి పుస్తకమే. ఈ 11 రోజు ల పుస్తకాల పండుగకు సాదరస్వాగతం. రండి.. పుస్తక విశ్వద ర్శనంలో పాల్గొనండి.

Related Posts