
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ఈడెన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అనూహ్య పరాజయం. ధావన్ కళ్లుచెదిరేలా ఆడిన వేళ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 7 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. మొదట కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు సాధించింది. శుభ్‌మన్ గిల్ (65; 39 బంతుల్లో 7×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శిఖర్, రిషబ్ పంత్ (46; 31 బంతుల్లో 4×4, 2×6) మెరుపులతో లక్ష్యాన్ని దిల్లీ 18.5 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.