
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా, ఆర్సీబీ జట్టు కెప్టెన్ పై రూ. 12 లక్షల జరిమానాను విధిస్తున్నట్టు ఐపీఎల్ మేనేజ్ మెంట్ వెల్లడించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, నియమిత సమయంలో ఓవర్లను పూర్తి చేయకపోవడం నేరమన్న సంగతి తెలిసిందే. దీంతో కెప్టెన్ గా ఉన్న కోహ్లీ, తన మ్యాచ్ ఫీజులో కొంత జరిమానాగా చెల్లించక తప్పని పరిస్థితి.