YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఊపందుకున్న  స్టాక్ మార్కెట్లు 

Highlights

  • 300 పాయింట్లకు పైగా లాభపడ్డ సూచీ
  • ఊతమిచ్చిన జీడీపీ గణాంకాల అంచనా
ఊపందుకున్న  స్టాక్ మార్కెట్లు 

స్టాక్ మార్కెట్లు చాలా రోజుల తర్వాత కొనుగోళ్లతో కళకళలాడాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారత వృద్ధిరేటు 7 శాతం స్థాయిలో నమోదవనున్నదని మోర్గాన్ స్టాన్లీ అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు సూచీల్లో జోష్‌ను మరింత పెంచింది. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడి మూడు వారాల గరిష్ట స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 10,500 పాయింట్లపైకి ఎగబాకింది. ముఖ్యంగా జీడీపీ అంచనాలు పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్‌ను మెరుగుపరుచడానికి దోహదపడిందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. 34,225.72 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 34,483.39 గరిష్ఠ స్థాయిని తాకి చివరకు 303.60 పాయింట్ల లాభంతో 34,445.75 వద్ద ముగిసింది.  జీడీపీ గణాంకాలను ఈ బుధవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నది. 
పీ-నోట్స్ ద్వారా దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి వచ్చే పెట్టుబడులు భారీగా పడిపోయాయి. జనవరి నెలలో ఈ పెట్టుబడులు ఎనిమిదిన్నరేండ్ల కనిష్ఠ స్థాయి రూ.1.19 లక్షల కోట్లకు తగ్గినట్లు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ వెల్లడించింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను నేరుగా పెట్టకుండా, పీ-నోట్ల ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుంది.
సింభౌలీ షుగర్స్ షేరు పడిపోయింది..
సింభౌలీ షుగర్స్ చైర్మన్ గుర్మిత్ సింగ్ మన్, కంపెనీ డిప్యూటీ ఎండీ గుర్పాల్ సింగ్‌లకు వ్యతిరేకంగా సీబీఐ కేసు దాఖలు చేయడంతో స్టాక్ మార్కెట్లో కంపెనీ షేరు ధర భారీగా పడిపోయింది. ఒక దశలో 20 శాతం వరకు క్షీణించిన షేరు ధర చివరకు 15.73 శాతం తగ్గి రూ.14.20 వద్ద ముగిసింది. దీంతో 52 వారాల కనిష్ఠ స్థాయికి జారుకున్నట్లు అయింది. దేశంలో అతిపెద్ద చక్కెర ఉత్పత్తి సంస్థల్లో సింభౌలీ షుగర్స్ ఒకటి. 

Related Posts