YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

అమెరికాలో శతచండీ యజ్ఞం

Highlights

  • మార్చి 1 నుంచి 11 వరకు
అమెరికాలో శతచండీ యజ్ఞం

అమెరికాలో వచ్చే నెల 1 నుంచి 11 వరకు లోక కల్యాణం కోసం శతచండీ యజ్ఞం నిర్వహించనున్నారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లివర్‌మోర్‌లోని శివవిష్ణు ఆలయంలో  అతిరుద్ర,  శతచండీ యజ్ఞాన్ని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ మహత్తర యజ్ఞాల్లో భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శతచండీ యాగం చివరి రోజున శివపార్వతుల కల్యాణం, అతిరుద్ర ముగింపు సందర్భంగా నంది వాహన సేవతో ఈ వేడుకలు ముగుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

Related Posts