YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ప్రియురాలి కోసం దొంగతనం

ప్రియురాలి కోసం దొంగతనం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

చాలా మంది దొంగలుగా మారడానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ ఓ యువకుడు ఖరీదైన బహుమతులు ఇవ్వడం కోసమే దొంగగా మారాడు. ఆ యువకుడు ప్రియరాలి కోరిక తీర్చడం కోసం దొంగతనాలకు పాల్పడుతూ ఎట్టకేలకు  పోలీసులకు చిక్కాడు. 
బల్వీర్సింగ్ తన ప్రియురాలి మోజులో పడి దొంగగా మారి నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడుతున్న  బల్వీర్సింగ్ను ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తన ప్రియురాలి కోసం దొంగతనాలకు పాల్పడునట్లు పోలీసుల విచారణలో తేలింది.  సుల్తాన్ బజార్లోగల బడిచౌడికి చెందిన బల్వీర్సింగ్ అలియాస్ బల్లు ఎవరు లేని  ఇంటి తాళాలు పగుల కొట్టి చోరీలు చేయడంలో ఎంతో రాడు తేలాడు .దొంగతనం కేసులో పలుమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు  బల్వీర్సింగ్ సంపన్న కుటంంబానికి చెందినవాడు. .డిగ్రీ వరకు చదువుకున్న అతను ప్రియురాలికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం కోసం దొంగతనాలకు పాల్పపడుతున్నాడు..ఎస్ఆర్ నగర్ లిమిట్స్ లో మూడు దొంగతనాలు, చేసాడు..రాయదుర్గం, పెట్  బషిరా బాడ్ లో పలు దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు..
డిగ్రీ చదివిన బల్వీర్ సింగ్ హైదరాబాద్ నగరంలోని కాచిగూడ ప్రాంతంలో నెలకు రూ.3 లక్షలు వరకు అద్దెలు వచ్చే భవనాలు కూడా  ఉన్నాయి. ఎంతో ఆస్తి పాస్తులు ఉన్న బల్వీర్సింగ్  ప్రియురాలు కోసం ఇలా తయారయ్యాడు. బల్వీర్సింగ్ ప్రియురాలు  బెంగుళూరులోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో ఎంబీఎ చదువుతున్నట్లు తెలుస్తుంది.  ఆమెకు విలువైన బహుమతులు ఇస్తూ ఆమెను సంతోష పెట్టడం కోసం బల్వీర్సింగ్ దొంగగా మారినట్లగా తెలుస్తుంది.  బల్వీర్సింగ్ ఇటీవల బల్కంపేట లోని వేంటటేశ్వరస్వామి ఆలయం వద్ద గల ఓ ఇంట్లో 30 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశాడని గుర్తించిన పోలీసులు ప్రస్తుతం ఎస్సార్ నగర్ క్రైం పోలీసులు ఆతని  పట్టుకున్నారు,దాదాపు . బల్వీర్సింగ్ నుండి  ఆఫ్ కేజీ గోల్డ్ ను స్వాధీనం చేసుకున్నారు. 

Related Posts