YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రిలయన్స్ బిగ్ టీవీ ఆఫర్: ఏడాది పాటు అన్ని పెయిడ్, హెచ్ డీ చానల్స్ ఉచితం.

Highlights

  • కనెక్షన్ రూ.2,000 చెల్లించి తీసుకోవాలి
  • అన్నీ ఉచితం ఏడాది వరకూ
  • ఆ తర్వాత ప్రతీ నెలా రూ.300 రీచార్జ్
  • రూ.2,000 రీచార్జ్ వెనక్కి రెండేళ్ల  తర్వాత 
  • ఉచిత చానల్స్ వీక్షణ అవకాశం ఐదేళ్ల పాటు
రిలయన్స్ బిగ్ టీవీ ఆఫర్: ఏడాది పాటు అన్ని పెయిడ్, హెచ్ డీ చానల్స్ ఉచితం.

రిలయన్స్ బిగ్ టీవీ డీటీహెచ్ సేవల్లోని ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించే లక్ష్యంతో సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. కనెక్షన్ కోసం రిలయన్స్ బిగ్ టీవీ సంస్థకు చెందిన వెబ్ సైట్ ద్వారా రూ.499 చెల్లించి బుక్ చేసుకుంటే ఏడాది పాటు హెచ్ డీ చానల్స్, పెయిడ్ చానల్స్ అన్నీ ఉచితం. అలాగే ఎయిర్ టు ఫ్రీ చానల్స్ కూడా ఐదేళ్ల పాటు ఉచితంగా వీక్షించవచ్చు. ఇందుకోసం సంస్థ వెబ్ సైట్ లో బుకింగ్ లు ఈ నెల 1న ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యాయి. ఇందుకోసం కొన్ని షరతులు కూడా పెట్టింది కంపెనీ. మొదట  రూ.499 చెల్లించి బుక్ చేసుకోవాలి. 

మరో రూ.1,500తోపాటు రూ.250 ఇన్ స్టలేషన్ చార్జీలు కూడా ఇంటికి టెక్నీషియన్ వచ్చి డిష్, సెట్ టాప్ బాక్స్ సెట్ చేసినప్పుడు చెల్లించాల్సి ఉంటుంది. తొలుత ఏడాది ఇక రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండో ఏడాది నుంచి ప్రతీ నెలా రూ.300 రీచార్జ్ చేసుకుంటే అన్ని సేవల్ని యథావిధిగా పొందొచ్చు.

ఇలా రెండేళ్ల పాటు ప్రతీ నెలా రూ.300 చొప్పున రీచార్జ్ చేసుకుంటే ఆ తర్వాత అంటే కనెక్షన్ తీసుకుని ముచ్చటగా మూడేళ్లు పూర్తయిన తర్వాత సెట్ టాప్ బాక్స్, కనెక్షన్ కోసం మొదట చెల్లించిన రూ.2,000 వెనక్కి వచ్చేస్తాయి. ఆ రూ.2,000 లను యూజర్ బిగ్ టీవీ అకౌంట్ లో జమ చేస్తారు. తిరిగి చానల్స్ రీచార్జ్ కోసం వినియోగించుకోవచ్చు.

Related Posts