YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

తొలుత ప్రయోగాత్మకంగా కంపెనీ ఉద్యోగులకే ఐడియా నుంచీ 4జీ వోల్టే సేవలు.

Highlights

  • తొలుత కంపెనీ ఉద్యోగులకే తర్వాత కస్టమర్లకు
  • హైదరాబాద్ తో సహా తదితర 30 పట్టణాల్లో ఆరంభం
  • ఏప్రిల్ నెల చివరికి అన్ని సర్కిళ్లకూ
తొలుత ప్రయోగాత్మకంగా కంపెనీ ఉద్యోగులకే ఐడియా నుంచీ 4జీ వోల్టే సేవలు.

రిలయన్స్ జియోతో మొదలైన 4జీ వోల్టే సేవలు ఇప్పుడు ఐడియా వరకు విస్తరించాయి. ఐడియా కంపెనీ 4జీ వోల్టే సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. తొలుత ఐడియా కంపెనీ ఉద్యోగులకు మాత్రమే కొన్ని సర్కిళ్ల పరిధిలోనే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా ఒక్కో సర్కిల్ పరిధిలో ఈ సేవలు కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయని ఐడియా కంపెనీ తెలిపింది. నాలుగు సర్కిళ్ల పరిధిలో 30కు పైగా పట్టణాల్లో ఐడియా కంపెనీ 4జీ వోల్టే సేవలను ఆరంభించింది.

హైదరాబాద్, సూరత్, అహ్మదాబాద్, రాజ్ కోట్, నాగ్ పూర్, నాసిక్, గోవా, పునె, త్రివేండ్రం, క్యాలికట్, కోచి తదితర పట్టణాలు ఇందులో ఉన్నాయి. ఏప్రిల్ నెల ఆఖరుకు 20 సర్కిళ్లలోనూ 4జీ వోల్టే సేవలను తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది.  

Related Posts