YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నవ్వుకోండి

సరదా ప్రశ్నలు. కొంటె జవాబులు.

సరదా ప్రశ్నలు. కొంటె జవాబులు.

1. సుఖంగా ఉన్న ప్రాణాని కష్ట పెట్టడం అంటే?
Ans. పెళ్లి చేసుకోవడం.

2. చావుకు ఎదురు వెళ్లడం అంటే?
Ans. భార్యకు ఎదురు చెప్పడం.

3. గోడకు తల బాదుకోవడం అంటే?
Ans. భార్యకు ఎదైన అర్థమైయ్యేలా చెప్పడం.

4. స్వర్గం నరకం అంటే?
Ans. భార్య పుట్టింటికి వెళ్లడం,
నాలుగు రోజుల్లోనే తిరిగి రావడం.

5. పగ తీర్చుకోవడం అంటే?
Ans. పెళ్లి చేసుకోమని ఒకరికి సలహా ఇవ్వడం.

6. సొంత లాభం చూసుకోవడం అంటే?
Ans. పెళ్లి చేసుకోకుండా ఉండటం.

7. పాపానికి శిక్ష అంటే?
Ans. పెళ్లి జరగడం.

8. లవ్ మ్యారేజ్ అంటే?
Ans. మనతో యుద్ధం చేయడానికి శత్రువుని చూసుకోవడం.

9. పులి నోట్లో తల పెట్టడం అంటే?
Ans. పెళ్లికి సరే అనడం.

10. పెళ్లి ఫోటోలు చూడడం అంటే?
Ans. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడటం.

11. పెళ్లి అంటే? 
Ans. చేయని నేరానికి శిక్ష.
 

జీతోపదేశం 

పుట్టిన వారికి వివాహం తప్పదు,
పెళ్లైన వారికి భార్యతో బాధలు తప్పవు,
అనివార్యమగు విషయము గూర్చి శోకింపజాలదు.

 తప్పించుకున్న వాడు ధన్యుడు సుమతీ

Related Posts