
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కత్తులతో దారుణంగా నరికి చంపారు దుండగులు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని రుద్రారంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రుద్రారం ముంబై హైవేపై మహమూద్ అనే వ్యక్తిని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దారుణంగా నరికి చంపారు. పట్టపగలు, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దారుణం చోటుచేసుకుంది. ఐదు నెలలక్రితం లక్డారంలో జరిగిన హత్యకేసులో మహమూద్ నిందితుడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరినట్లు
తెలుస్తోంది.