YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

వెంకటేష్ ప్రసాద్ రాజీనామా

Highlights

 

  • 30 నెలల పాటు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలు
  • పని ఒత్తిడితోనే  బీసీసీఐ
వెంకటేష్ ప్రసాద్ రాజీనామా

జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి భారత్ జట్టు  మాజీ పేస్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ రాజీనామా చేశారు. ఈ  సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను ప్రసాద్ 30 నెలల పాటు నిర్వహించిన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. భారత అండర్-19 జట్టు నాలుగోసారి ప్రపంచ కప్ ను గెలుచుకున్న కొన్ని రోజులకే వైదొలగడం విశేషం. 
 క్రికెట్ కు సంబంధించిన వేరే కార్యకలాపాలకు సమయం కేటాయించే నేపథ్యంలో వెంకటేష్ ప్రసాద్ రాజీనామా చేశారని బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా తెలిపారు. అయితే, ఎలాంటి అసైన్ మెంట్ ను ఆయన చేపట్టబోతున్నారనే విషయాన్ని రాజీనామాలో పేర్కొనలేదని చెప్పారు. ఆయనకు  ప్రత్యామ్నాయంగా ఎవర్ని తీసుకోవాలనే విషయాన్ని ఇంతవరకు తాము ఖరారు చేయలేదని తెలిపారు. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునేందుకు త్వరలోనే బీసీసీఐ భేటీ అవుతుందని చెప్పారు. 


 

Related Posts