YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సాహిత్యం

సంగీత నాటక అకాడమీ పురస్కారాలు

సంగీత నాటక అకాడమీ పురస్కారాలు

నలుగురు తెలుగు కళాకారులకు సంగీత నాటక అకాడమీ పురస్కారాలు

ప్రముఖ సంగీత శాస్త్రవేత్త పప్పు వేణుగోపాలరావు, రంగస్థల కళాకారిణులు అన్నాబత్తుల లక్ష్మీ మంగతాయారు, అన్నాబత్తుల లీలాసాయి, కూచిపూడి నర్తకి ఏబీ బాల కొండలరావులకు సంగీత నాటక అకాడమీ అవార్డులు లభించాయి. బుధవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా వారు పురస్కారాలు అందుకున్నారు. వీరితోపాటు 43 మంది 2016 సంవత్సరానికిగాను ఈ అవార్డులను స్వీకరించారు.

వీరిలో పద్మా తల్వాల్కర్‌, ప్రభాకర్‌ కరేకర్‌(హిందూస్థానీ సంగీతం), కళా రామనాథ్‌(వయోలిన్‌), అరవింద్‌ ముల్గాంకర్‌(తబలా), నీలారామగోపాల్‌, కె. ఓమనకుట్టి (కర్ణాటక సంగీతం) తదితరులు ఉన్నారు. సంగీ త రంగంలో విశిష్ట కృషి చేసినందుకు వేణుగోపాలరావుకు ఈ అవార్డు లభించింది. బొబ్బిలిలో జన్మించిన ఆయన మంగళంపల్లి బాల మురళీకృష్ణ వద్ద సంగీతంలో మెలకువలను నేర్చుకున్నారు. కళాక్షేత్ర,మద్రాస్‌ సంగీత అకాడమీలకు ఆయన సేవలందిస్తున్నారు.

ఇక సంగీత నాటక అకాడమీ అవార్డును సంయుక్తంగా స్వీకరించిన అన్నాబత్తుల మంగతయారు, లీలాసాయి తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో జన్మించారు. ప్రాచీన ఆలయ సంప్రదాయంలో వారు శిక్షణ పొంది పలు కళారూపాలను ప్రదర్శించారు. ఇక కూచిపూడి నర్తకి ఏబీ బాలకొండలరావు ఏపీలోని రాజవోలులో జన్మించారు. వెంపటి చినసత్యం వద్ద ఆమె కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందారు.

Related Posts