YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

చరిత్రలో ఈ రోజు 

Highlights

  • మార్చి 0⃣3⃣
  • సంఘటనలు
  • జయంతులు.. 
  • వర్ధంతులు..
  • వర్ధంతులు..
  • జాతీయ దినోత్సవాలు..
చరిత్రలో ఈ రోజు 

మార్చి 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 62వ రోజు (లీపు సంవత్సరములో 63వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 303 రోజులు మిగిలినవి.

సంఘటనలు
1991: విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన్ కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము. కళాభారతి ఆడిటోరియము 1991 మే 11 లో, విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.
2008: రష్యా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.
2009: పాకిస్తాన్లో లాహోర్ లోని గఢాఫి స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు.
1938: సౌదీ అరేబియాలో పెట్రోల్ గుర్తింపు.
1939: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ముంబైలో నిరాహార దీక్ష.

జయంతులు.. 
1847: అలెగ్జాండర్ గ్రహంబెల్, టెలీఫోనును కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త. (మ.1922)
1880: ఆచంట లక్ష్మీపతి, ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు మరియు సంఘసేవకుడు. (మ.1962)
1891: కొంగర సీతారామయ్య, ప్రముఖ రంగస్థల నటుడు,కవులకు, గాయకులకు, పండితులకు, మిత్రులకు ఎనలేని దానాలు చేశాడు. (మ.1978)
1895: రాగ్నర్ ఫ్రిష్, ప్రముఖ ఆర్థికవేత్త . (మ.1973)
1937: సత్యం శంకరమంచి, పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది.అమరావతి కథలు గ్రంథానికి 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పొందారు.
1939:  ఎం.ఎల్.జయసింహ,హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.
1955: జస్పాల్ భట్టి, ప్రముఖ హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (మ.2012)
1967: శంకర్ మహదేవన్, ప్రముఖ భారతీయ గాయకుడు, స్వరకర్త.
1982: జెస్సికా బీల్, అమెరికా నటీమణి మరియు పూర్వపు మోడల్.
1989: కృష్ణ దేశగాని, ప్రముఖ రచయిత మరియు సంఘసేవకుడి జననం
1839: టాటా గ్రూప్ వ్యవస్థాపకులు జంషెడ్జీ టాటా జననం

వర్ధంతులు..
1943: శ్రీపాద కామేశ్వరరావు, సుప్రసిద్ధ రంగస్థల నటుడు,మరాఠీ, ఒరియా, తమిళ, ఫ్రెంచి, పంజాబీ నాటకలాల్ను ఆంధ్రావళికి అనువదించి అందించారు.
1993: అమెరికాకు చెందిన ఓరల్ పోలియో వాక్సిన్ సృష్టికర్త అల్బెర్ట్ సాబిన్
2002: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (జ.1951)
2008: వాహినీ సంస్థ వారి దేవత, సుమంగళి వంటి చిత్రాలలో నటించిన నటీమణి కుమారి

జాతీయ  దినోత్సవాలు..
ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం.

Related Posts