YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

స్కాలర్‌షిప్‌ల కోసం.. ఎదురుచూపు

స్కాలర్‌షిప్‌ల కోసం.. ఎదురుచూపు

ఏడాది పూర్తయినా అందని ఉపకార వేతనాలు
దరఖాస్తు చేసుకున్నా సకాలంలో సంక్షేమ శాఖలకు పంపని సిబ్బంది
14 మందికి మాత్రమే మెస్‌చార్జీలు విడుదల
ఆందోళన చెందుతున్న ప్రభుత్వ మెడికల్‌ కళాశాల విద్యార్థులు

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త ర్వాత జిల్లాకు మంజూరైన మొట్టమొదటి మెడి కల్‌ కళాశాల ఇది. ఇబ్బందులు, అసౌకర్యాల మధ్య ఒక ఏడాది పూర్తయ్యింది. విద్యార్థులు కూడా కష్టపడి చదివి ఈ కళాశాలలో సీటు సంపాదించారు.. ఇంట్లో తల్లిదండ్రులు సైతం అప్పో, సప్పో చేసి వారిని చదివిస్తున్నారు. ప్ర భుత్వం అందించే స్కాలర్‌షిప్‌తో చదువుకొని డాక్టర్‌ కావాలనే విద్యార్థుల ఆశలపై కళాశాల అధికారులు నీళ్లు చల్లుతున్నారు. స్కాలర్‌షిప్‌తో ఫీజులు చెల్లించుకోవాలని దీని కోసం దరఖా స్తులూ చేసుకున్నారు. కానీ సంబంధిత అధికా రులు మాత్రం సకాలంలో ఆ దరఖాస్తులను ఆ యా సంక్షేమ శాఖలకు పంపించకుండా నిర్ల క్ష్యం చేశారు. దీంతో ఏడాది చదువు పూర్తయి నా ఇంతవరకు స్కాలర్‌షిప్‌ రాలేదు. ఉన్న 150 మందిలో కేవలం 14 మంది విద్యార్థులకు మాత్రమే మెస్‌చార్జీలు విడుదలయ్యాయి. ఉప కారవేతనాలు మాత్రం ఒక్కపైసా కూడా విడు దల కాలేదు. కానీ అధికారులు మాత్రం కళా శాల ఫీజు చెల్లించాలని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో తమ ఉప కార వేతనాలు ఎప్పుడు వస్తాయోనని విద్యా ర్థులు ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జి ల్లాకు మొట్టమొదటి మెడికల్‌ కళాశాలను మం జూరు చేసింది. మొత్తం 150 మంది విద్యార్థు లతో 2016-17 విద్యా సంవత్సరం కళాశాల ప్రా రంభమైంది. ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకుల మధ్య మొదటి బ్యాచ్‌ కూడా పూర్తయ్యి, రెండో బ్యాచ్‌ అడుగుపెట్టింది. కానీ ఏడాది చదువులు పూర్తయినా మొదటి ఏడాది విద్యార్థులకు ఉప కార వేతనాలు అందలేదు. ప్రభుత్వం అందిం చే ఉపకార వేతనాలు కొంత సహాయం అవు తాయని, వాటిపైనే ఆధారపడి కొంతమంది వి ద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు. అంతేకా కుండా కళాశాలలో ప్రవేశం పొందిన వెంటనే స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటికీ ఒక్కరు కూడా ఉపకార వేతనం పొందలేని పరిస్థితి ఉంది.

45 మంది దరఖాస్తు..

కళాశాలలో మొత్తం 150 మంది విద్యా ర్థులుండగా చాలా మంది సొంత డబ్బుతో చ దువుకుంటున్నారు. కొంతమంది మాత్రం స్కా లర్‌షిప్‌ సహాయంతో చదువుతున్న వారు ఉ న్నారు. అందరు కన్వీనర్‌ కోటా కింద ప్రవేశా లు పొందిన వారే. అయితే ప్రభుత్వం ఒక్కో వి ద్యార్థికి ఏడాదికి రూ.60 వేలు ట్యూషన్‌ ఫీజు, రూ.3,900 మెస్‌చార్జీల చొప్పున విడుదల చేస్తుం ది. ఇందులో భాగంగానే కళాశాలలో దాదాపు 45 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఆయా సంక్షేమ శాఖలకు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖా స్తు చేసుకున్నారు.

మంజూరైంది 14 మందికే..

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు స్కాలర్‌ షిప్‌ల కోసం 45 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 14 మందికి మెస్‌చార్జీలు రూ. 3,900 చొప్పున మంజూరయ్యాయి. అందులో ఎస్సీ 7 మంది దరఖాస్తు చేసుకోగా 5 మందికి, ఎస్టీలో దరఖాస్తు చేసుకున్న 7 మందికి, బీసీలో 31 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం ఇద్దరికి మాత్రమే మెస్‌చార్జీలు విడుదల చేశారు. అ యితే ఒక్కరికి కూడా ట్యూషన్‌ ఫీజు రూ.60 వేలు ఇప్పటి వరకు మంజూరు కాలేదు.

సిబ్బంది నిర్లక్ష్యంతోనే జాప్యం..

కొత్తగా ఏర్పాటైన కళాశాల కావడంతో కొం త మంది విద్యార్థులు మాత్రం స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల కాపీల ను కళాశాల సెక్షన్‌ సిబ్బంది ప్రిన్సిపాల్‌ సంత కాలతో సర్టిఫై చేయాల్సి ఉంటుంది. అదేవిధం గా ఆ దరఖాస్తులను సెప్టెంబర్‌ నెలలో ఆయా సంక్షేమ శాఖలకు పంపించాలి. కానీ సెక్షన్‌ సి బ్బంది నిర్లక్ష్యం వల్ల సకాలంలో ఆ దరఖాస్తు లు సంక్షేమ శాఖలకు చేరలేదు. ఎస్సీల దరఖా స్తులు నవంబర్‌ నెలలో, ఎస్టీల దరఖాస్తులు అదే నెల చివరి వారంలో, బీసీల దరఖాస్తులు డిసెంబర్‌ 30న పంపించారు. దీంతో వారికి రె గ్యులర్‌ వారితో పాటు మంజూరు కాలేకపో యాయి. సకాలంలో పంపించి ఉంటే ఈ ఏడా ది జనవరిలోనే వారికి స్కాలర్‌షిప్‌లతో పాటు మెస్‌చార్జీలు కూడా అంది ఉండేవి. ప్రధానంగా 31 మంది బీసీలు దరఖాస్తు చేసుకోగా అందు లో మానస, శ్రీమాన్‌సాయిలవి ఇంకా పంపలే దు. మిగతా 29 మందిలో కేవలం ఇద్దరికి మా త్రమే మెస్‌చార్జీలు విడుదలయ్యాయి. ఇంత ఆ లస్యంగా దరఖాస్తులు పంపడంతో ఇప్పటి వర కు ఒక్కరికీ ట్యూషన్‌ ఫీజు మంజూరు కాలేదు.

ఆందోళనలో విద్యార్థులు

ఏడాది పూర్తయినా స్కాలర్‌షిప్‌లు రాకపో వడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇంట్లోవాళ్లు అప్పులు చేసి ఫీజులు చెల్లించారు. కనీసం స్కాలర్‌షిప్‌లు కూడా రాకపోతే ఆ అ ప్పులు ఎలా తీర్చాలి, వచ్చే ఏడాది ఫీజులు ఎ లా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కళాశాల అధికారులు ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలి సింది. ఈ ఒత్తిళ్ల వల్ల విద్యార్థులు చదువుపై దృష్టిపెట్టలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని అన్ని మెడికల్‌ కళాశాలల విద్యార్థులకు ప్రథ మ సంవత్సరం స్కాలర్‌షిప్‌లు విడుదలయ్యా యి. తమ స్కాలర్‌షిప్‌లు ఎప్పుడు విడుదల అవుతాయని వేయి కళ్లతో వేచిచూస్తున్నారు.

 ఆలస్యంగా రావడం వల్లే..

మెడికల్‌ కళాశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ లు మంజూరు చేయడంలో గల కారణాలపై ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం శాఖల డీడీలను ఆంధ్రజ్యోతి వివరణ కోరింది. తమకు దరఖా స్తులు చాలా ఆలస్యంగా వచ్చాయని, అందువ ల్ల మంజూరులో కొంత జాప్యమైందని వారు చెప్పుకొచ్చారు. సెప్టెంబర్‌లోనే దరఖాస్తులు వ చ్చి ఉంటే రెగ్యులర్‌ కళాశాలలతో పాటుగా స్కా లర్‌షిప్‌లు వచ్చేవని, త్వరలో ట్యూషన్‌ ఫీజు లు కూడా విడుదల చేస్తామని పేర్కొన్నారు.

Related Posts