YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గ్రామ సర్పంచులకు వెంటనే చెక్ పవర్ ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య

గ్రామ సర్పంచులకు వెంటనే చెక్ పవర్ ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య

రాష్ట్రంలోని 12751 మంది గ్రామ సర్పంచులకు వెంటనే వారం రోజులలో చెక్ పవర్ ఇవ్వాలని, లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ ఆఫీసులో, ఎం.ఆర్.ఓ ఆఫీసుల వద్ద నిరసన ప్రదర్శనలు – ముట్టడులు చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. నేడు హైదరాబాద్ లోని బిసి భవన్ కు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సర్పంచులు వచ్చి కలిశారు. గ్రామ పంచాయితి ఎన్నికలు జరిపి దాదాపు 5 నెలలు గడుస్తుంది. కాని గ్రామాభివృద్ది – ఇతర కార్యక్రమాలు చేపడుదామంటే సర్పంచ్ లకు ఇంత వరకు చెక్ పవర్ ప్రభుత్వం ఇవ్వడం 
లేదు.గ్రామపంచాయతీ ఖాతాలో ఇంటి పన్నుల ద్వారా, రిజిస్ట్రేషన్లద్వారా, గనుల ద్వారా ఇతర మార్గాల ద్వారా వచ్చిన బడ్జెట్ గ్రామ పంచాయితి ఖాతా లో ఉంది. ఈ డబ్బును గ్రామాభివృద్దికి – 
కార్యక్రమాలకు ఖర్చు పెడదామంటే సర్పంచ్ లకు, చెక్ పవర్  ఇవ్వలేదు. చెక్ పవర్ లేక పోవడంతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, వీధి దీపాలు, ఇతర అభివృద్ధి పనులు ఆగిపోయాయి. మండే ఎండాకాలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీరు లేక గ్రామ ప్రజలు అల్లాడుతున్నారు. చాల గ్రామలకు  మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదు. దీనితో బోరు బావులు తవ్వాలన్న, ఉన్న బోరు భావులను రిపేర్లు చేయాలన్న సర్పంచులు అప్పుతెచ్చి ఖర్చు పెడుతున్నారు. ఎండాకాలం తీవ్రంగా ఉంది. కొన్ని గ్రామాలలో బోర్లు ఎండిపోయాయి, నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. తాగడానికి మనుషులకే కాదు పశువులకు కూడా నీరు లేక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే చెక్ పవర్  ఇవ్వాలని డిమాండ్ చేశారు.గత ఏడు నెలలుగా రాష్ట్రo లోని 40 వేల గ్రామ పంచాయితి సిబ్బంది జీతాలు ఇవ్వడం లేదు. ఈ సిబ్బంది కి ఇచ్చే జీతాలు చాల తక్కువ. గత 7 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బ్రతుకుతారు? కావున వెంటనే చెక్ పవర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.గ్రామ సర్పంచ్ లకు గౌరవ వేతనం నెలకు 5 వేల నుండి 30 వేలకు పెంచాలని కోరారు. ఎంఎల్ఏ కు నెలకు 2 లక్షల 75 వేలు ఇస్తుంటే సర్పంచ్ కు 5 ఇస్తే ఎలా సరిపోతాయన్నారు.కొన్ని గ్రామాలలో సర్పంచులు ఏదైనా కార్యక్రమాలు  చేపడతామoటే నిధులు లేవు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఏమైనా సొంత ఖర్చులు పెడదామంటే ఇటీవల ఎన్నికలలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎన్నికయ్యారు. కావున వెంటనే గ్రామాల అభివృద్దికి  అదనంగా బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.ముఖ్యమంత్రి గతంలో గ్రామజ్యోతి - గ్రామాల సంపూర్ణ వికాసం అంటూ అనేక పథకాలు ప్రకటించారు. గ్రామాలలో ప్రజలకు అనేక ఆశలు చిగురించాయి. ప్రతి గ్రామానికి జనాభాను బట్టి 30 నుంచి 50 లక్షల వరకు నిధులు  కేటాయించి గ్రామాలలో అన్ని రంగాలలో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గత మూడు  సంవత్సరాల కాలంలో గ్రామాలకు నిధులు కేటాయించక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేక పోతున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.రాజ్యాంగం ప్రకారం గ్రామ సర్పంచులకు 28 శాఖల అధికారులు ఇచ్చారు. కాని ఇంత వరకు తగు ఉత్తర్వులు జారి చేయలేదు. కావున వెంటనే రాజ్యాంగం ఇచ్చిన హక్కులు – భాద్యతలపై ఉత్తర్వులు జారీ చేయాలనీ విజ్ఞప్తి చేశారు.14 వ ఫైనాన్స్ నిధులు, ఇతర గ్రాంట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి చట్టబద్ద ఆటంకం ఏది లేవు. వెంటనే నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.సర్పంచ్ ల సమస్యల పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

Related Posts

0 comments on "గ్రామ సర్పంచులకు వెంటనే చెక్ పవర్ ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య"

Leave A Comment