YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అల్లకల్లోలంగా గుజరాత్ తీరం

అల్లకల్లోలంగా గుజరాత్ తీరం

వాయు తుఫాన్ దూసుకువ‌స్తోంది. గుజ‌రాత్ తీరం వైపు అది వెళ్తోంది. ప్ర‌స్తుతం ముంబైకి 290 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉన్న‌ది. గుజ‌రాత్‌లోని పోరుబంద‌ర్-డ‌యూ నుంచి వీరావ‌ల్ వ‌ద్ద అది తీరం దాటే అవ‌కాశాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఈదురుగాలులు వీస్తున్నాయి. సుమారు 155 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గురువారం ఉద‌యం ఆ గాలులు 170 కిలోమీట‌ర్ల వేగానికి చేరుకునే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రోవైపు ఎన్డీఆర్ఎఫ్ ద‌ళాలు స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం ఏర్పాటు చేశాయి. గుజ‌రాత్‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్లు ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు. రేపు ఉద‌యం 8 నుంచి 12 గంట‌ల మ‌ధ్య వాయు తుఫాన్ తీరం దాటే ఛాన్సు ఉంద‌ని కేంద్ర హోంశాఖ చెప్పింది. తుఫాన్ స‌మ‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి ఒడిశా నుంచి గుజ‌రాత్ హెల్ప్ తీసుకున్న‌ది. వీరావ‌ల్‌, ఓకా, పోరుబంద‌ర్‌, భావ‌న‌గ‌ర్‌, భుజ్‌, గాంధీదామ్ నుంచి బ‌య‌లుదేరే రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. రేపు సాయంత్రం 6 త‌ర్వాత ఈ స్టేష‌న్ల నుంచి రైళ్ల‌ను నిలిపేస్తారు. 

Related Posts