YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాహుల్ గాంధీని నిందించి చేతకాని తనం బయట పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీని నిందించి చేతకాని తనం బయట పెట్టుకున్నారు   సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్
భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సెక్రటేరియట్ ఎదురుగా ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భం గా సీఎం రేవంత్ మాట్లాడుతూ.
రాజీవ్ గాంధీని స్మరించు కోవడమంటే.. తీవ్రవాదం మీద పోరాటం చేయ డమేనని అన్నారు. ఆర్ధిక సరళీకృత విధానాలకు మూలం రాజీవ్ గాంధీ పహల్గం ఘటన తర్వాత గాంధీ నీ 1971 లో పాకిస్తాన్ ను చెరపట్టిన ఇందిరాగాంధీని గుర్తు చేసుకున్నామని అన్నారు. పాకిస్తాన్ కి శాశ్వత గుణ పాటం చెప్పారు ఇందిరా గాంధీ.
అంతర్జాతీయ ఉగ్రవాదం ముసుగులో వచ్చిన వాళ్ళను నియంత్రించారు ఇందిరా గాంధీ. పాకిస్తాన్ మీద యుద్ధం జరిగిన ప్పుడు అమెరికా మధ్య వర్తిత్వం కోసం వచ్చింది. మీకు తెల్లరంగు ఉందని అజమాయిషీ అవసరం లేదని చెప్పారు.
పహల్గం సంఘటన తర్వాత మోడీకి మద్దతుగా నిలబడ్డాం రాహుల్ గాంధీ, ఖర్గే, దేశ ప్రజలు మోడీకి అండగా ఉన్నారు. కానీ దుర దృష్టవశాత్తు కేంద్రం అమెరికా అధ్యక్షుడు ఒత్తిడికి లొంగిపోయింది. వచ్చిన అవకాశం చేజార్చుకున్నారు మోడీ.. ట్రంప్ కి తలొగ్గాడు.
రాహుల్ గాంధీని నిందించి చేతగాని తనం బయట పెట్టుకున్నారు. కిషన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పహల్గం ఘటనకు అండగా మొదట బయటకు వచ్చింది మేము అప్పుడు కిషన్ రెడ్డి ఇంట్లో దుప్పటి కప్పుకుని పడుకున్నాడు. మీ గొప్పలు చెప్పుకోండి మీ చేతగాని తనం కప్పిపుచ్చుకోవడం కోసం రాహుల్ గాంధీ పై నిందలు వేయడం మానుకోవాలని అన్నారు.
గాంధీ కుటుంబం దేశం కోసం రక్తం ఇచ్చారు. రాజీవ్ గాంధీ విగ్రహంపై సంకుచిత స్వభావంతో మాట్లాడారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడం దేశం ఇప్పుడు ఇందిరా  గాంధీ, రాజీవ్ గాంధీలను గుర్తు చేసుకున్నారు దేశ సమగ్రత విషయంలో కట్టుబడి ఉంటామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Related Posts