YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఒక్క ఐడియాతో ప్రభుత్వ స్కూళ్లు దశ మారుతోంది

 ఒక్క ఐడియాతో ప్రభుత్వ స్కూళ్లు దశ మారుతోంది

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఓ ఐడియా మార్పు కు శ్రీకారం చుట్టింది,తమ ఊరి “గవర్నమెంట్ స్కూల్”ను కాపాడుకో డానికి నడుం కట్టిన గ్రామస్తులు.తమ కళ్లముందే  తమ ఊరి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల్లేక  అనాథగా ఎదురుచూస్తుంటే ఆ యువకులు తట్టుకోలేక పోయారు. తామే ఎలాగైనా తమ ఊరి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలని ఫిక్స్ అయ్యారు.దాని కోసం ఆ ఊరి లోని వారంతా  ఏకమయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్ మండలం సుంకేట గ్రామం,అక్కడ ఓ మేధోమధనం జరిగింది చివరకు తమ స్కూల్ ను కాపాడుకోవడం కోసం గ్రామంలోని విద్యార్థులను ఇతర ప్రయివేట్ పాఠశలలకు పంపించావద్దని,తమ గ్రామంలోకి ఇతర గ్రామాల  ప్రయివేట్ పాఠశలలకు  బస్సులు రావద్దని తీర్మానించారు ఆ గ్రామస్తులు.విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి, తరగతి గదుల నిండా విదార్థులతో గతంలో మాదిరిగా తమ స్కూల్ కళకళలాడాలని  చేయడమే వారి ఉద్దేశ్యం. దాని కోసం వారు ప్రవేశపెట్టిన ఆలోచనే… మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి- 1000/- విలువ చేసే స్కూల్ కిట్ ను ఉచితంగా పొందండి. అని ఓ పథకాన్ని కూడా ప్రవేశ పెట్టారు గ్రామస్తులు.కాలం మారింది తల్లీదండ్రులు కేవలం పిల్లల చదువు కోసం లక్షలు వెచ్చిస్తున్న పరిస్థితి. ప్రైవేట్ స్కూల్స్ , టెక్నో స్కూల్స్ , కాన్సెప్ట్ స్కూల్స్ అంటూ పాఠశాలల ముందు అందమైన ట్యాగ్ లైన్లను యాడ్ చేసుకుంటూ చదువు పేరుతో ప్రైవేట్ యాజమాన్యాలు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తుంటే,ఆధాటికి తట్టుకోలేని చాలా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల్లేక విలవిల్లాడుతున్నాయి. కొన్నైతే ఈపాటికే మూత పడిపోయాయి.రేష్నలైజేషన్ ప్రక్రియ స్టార్ట్ అయితే పిల్లల్లేని  చాలా ప్రభుత్వ పాఠశాలలు పిట్టల్లా ఎగిరిపోతాయి.ఇదే ఆలోచన ఆ ఊరి యువకుల్లో కలిగింది. ఎలాగైనా ప్రైవేట్ స్కూల్స్ ధాటిని తట్టుకునేలా,తల్లీదండ్రులను ఆకర్షించేలా వారే స్వయంగా ప్రచారంలోకి దిగారు. ప్రచారంలో భాగంగా  అసలైన విద్య అంటే ఎలా ఉంటుంది.అనేది చెప్పుతున్నారు గ్రామస్తులు. అది ప్రభుత్వ పాఠశాలలోనే  ఎందుకు దొరుకుతుంది.అని విడమరిచి చెప్పుతున్నారు ఆకక్ది ప్రజలు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు మద్య ఉన్న తేడా ఎంటి అని చెప్పడం ప్రారంభించారు ఆ ఉరి జనం. ప్రభుత్వ పాఠశాలలో చదివిన కుర్రాడి విజ్ఞానం ఎలా ఉంటుంది అనేది గవర్నమెంట్ స్కూల్స్ లో చదివితే కలిగే లాభాలేంటి అనే  ప్రతి విషయాన్ని విద్యార్థుల తల్లీదండ్రులకు విడమరిచి చెబుతున్నారు.మా ఊరి పాఠశాలను బతికించుకోవాలి. ప్రభుత్వ బడిలేని మా ఊరిని మేమెవ్వరం ఊహించుకోలేం…అందుకే మా ఈ ప్రయత్నం.. మా మాటలతో కొంతమందైనా ప్రభుత్వ బడులలో వారి పిల్లల్ని చేర్పిస్తే మేం సక్సెస్ అయినట్టే,అందుకే ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతివిద్యార్థికి మావంతు సహాయంగా 1000 రూపాయల విలువగల స్కూల్ కిట్ ను బహుమతిగా ఇచ్చి వారిని ప్రోత్సాహించాలని నిర్ణయించుకున్నామని,అంతేకాకుండా తమ పిల్లలను గవర్నమెంట్ బడులలో చేర్పించిన తల్లీ దండ్రులకు ప్రత్యేక అతిథిని పిలిచి ఆ అతిథితో సన్మానం కూడా చేయించాలనే ఆలోచనతో ఉన్నాట్లు గ్రామస్తులు చెపుతున్నారు.ఇలాంటి ఐడియా అన్ని గ్రామాల్లో వస్తే ఇక ప్రయివేటు  బడులెందుకని ఆలోచన వచ్చేవిదంగా చేసి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకోవాలని రానున్న రోజుల్లో ప్రభుత్వ బడులకే తమ పిల్లలను పంపించాలను ఆశిద్దాం.

Related Posts