
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నాలుగేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య చేసిన వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్‌కుమార్ అలియాస్ ధర్మేంద్ర అనే వ్యక్తి నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చాడు. ఈ ఘటన 2015లో రాజస్థాన్‌లోని బెహ్రార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. విచారణలో దోషిగా తేలిన రాజ్‌కుమార్‌కు అల్వార్ జిల్లా కోర్టు నేడు మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.