YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజకీయంగా బీజేపీ డ్యామేజ్ అవుతుందా

 రాజకీయంగా బీజేపీ డ్యామేజ్ అవుతుందా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

అయిదేళ్ల పాటు దేశాన్ని ఏలి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చాలా వర్గాలను ఆకట్టుకున్న నరేంద్ర మోడీ బంపర్ మెజారిటీతో తాజా ఎన్నికల్లో గెలిచారు. నరేంద్ర మోడీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని వర్గాలు ఇబ్బందుల పాలు అయినప్పటికీ ఆయన వల్ల దేశం బాగుపడుతుంది, నీతి, నిజాయతీలకు కట్టుబడి ఉండే నాయకుడు అన్న కారణంతో తిరిగి పట్టం కట్టారు. అయితే మోడీ మాత్రం అధికారంలోకి వచ్చిన ఇరవై రోజుల వ్యవధిలోనే ఆ నమ్మకాన్ని తగ్గించుకున్నారనిపించకమానదు. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను ఫిరాయింపచేసి బీజేపీలోకి కలుపుకోవడం ద్వారా మోడీ తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకున్నారని సర్వత్రా వినిపిస్తోంది.ఇక నలుగురు ఎంపీలు తమకు తాముగా ఓ పార్టీగా చెప్పుకుని విలీనం కావడం ఓ ఆక్షేప‌ణ అయితే వీరందరికీ టోకున బీజేపీలోకి చేర్చేసుకుని అంతే ఆత్రం బీజేపీ ప్రదర్శించింది. ఇక రాజ్యసభ చైర్మన్ హోదాలో వెంకయ్యనాయుడు వెనువెంటనే ఆమోదముద్ర వేయడం ఇదంతా చూస్తూంటే గంట ముందు టీడీపీ ఎంపీలు గంట తరువాత బీజేపీ సభ్యులైపోవడం ప్రజాస్వామ్య స్పూర్తికే విరుధ్ధంగా అనిపించకమానదు. ఇక ఈ నలుగురులో ఇద్దరి మీద నిన్నటి దాక ఐటీ, ఈడీ నిఘా వుంది. దాడులు జరిగాయి వారి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి అటువంటి వారిని బీజేపీలో చేర్చుకోవడం ద్వారా నరేంద్ర మోడీ దేశానికి ఏం సందేశం ఇస్తున్నట్లు అన్నది కూడా తేలాలి. ఇక మోడీ ఎవరికీ లొంగరు, అవినీతిని అణచేస్తారు అన్న వారికి ఈ పరిణామాలతో ఎవరు ఎవరికి లొంగిపోయారో అర్ధం కాని పరిస్థితిగా ఉంది.ఇక బీజేపీ అంటే తేడా పార్టీ అని చెప్పుకుంటారు. ఆరెస్సెస్ నేపధ్యం కూడా ఉంది. దేశభక్తి ఉంటుంది. అయితే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఈ మధ్య ఓ మాట అన్నారు. తమది కూడా రాజకీయ పార్టీయే. ధార్మిక సంస్థ కాదని. అంటే అందరూ చేసే విన్యాసాలు తామూ చేస్తామని చెప్పకని చెప్పారు. ఇక నరేంద్ర మోడీ, అమిత్ షా నేత్రుత్వంలో పార్టీ నడుస్తున్న తీరులో ఈ నలుగురు చేరికలు కొత్త మలుపు. మరీ ఇంత పచ్చిగా ఫిరాయింపులకు గేట్లు తెరవడం చూస్తూంటే రేపటి రోజున బలం ఉన్న వారిదే బర్రె అన్న నీతి అమలు చేస్తారవ్న భయం ప్రజాస్వామ్యవాదులకు కలుగుతోంది. ఒకనాడు కాంగ్రెస్ ఇలా చేసిందని నిందించిన వారే ఇపుడు అదే బాటలో నడవడం తిరోగమనమా, పురోగమనమా ఆలోచించాలిః

Related Posts