YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పపువా న్యూగినియాలో మరో భూకంపం

పపువా న్యూగినియాలో మరో భూకంపం

పపువా న్యూగినియాలో మరో సోమవారం కూడా మరో సారి భూకంపం సంభవించిందని అధికారులు వెల్లడించారు. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమౌదైందని అన్నారు.  దక్షిణ హైలాండ్స్, వెస్టర్న్, ఇంగ్గా, హేలా ప్రాంతాలలో గతవారం భూకంపం ధాటి నుండి కోలుకోకుండానే తాజాగా మరో భూకంపం సంభవించడంతో స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిందని ఆసంస్థ వ్యాఖ్యానించింది. ఫిబ్రవరి 26న పపువా న్యూ గినియా రిమోట్ పర్వతాలలో సంభవించిన భూకంపం ధాటికి నిరాశ్రయులైన వేలాదిమంది స్థానికులకు ఇప్పటివరకు ఆహారం, తాగునీరు, శానిటేషన్ సౌకర్యాలు అందక ఇబ్బందులు పడుతున్నారని రెడ్క్రాస్ వెల్లడించింది. భూకంపం తీవ్రత రిక్టర్స్కేలుపై 7.5గా నమోదవగా, దాని ధాటికి అనేక గ్రామాలకు రోడ్డు, విద్యుత్ సంబంధాలు తెగిపోయాయని, శుక్రవారం వెల్లడించిన నివేదిక ఆధారంగా 67మంది మృతి చెందగా, 1,43,000మంది ప్రజలపై ప్రభావం పడిందని రెడ్క్రాస్ అధికారులు తెలిపారు. 17,000మంది ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయన్నారు.వాహనాల ద్వారా నిరాశ్రయులైన వారికి ఆహారం అందిస్తున్నామని, అయితే కొన్ని ప్రాంతాలలోకి వెళ్లడానికి వీలులేకుండా కొండ చరియలు విరిగిపడటంతో రోడ్లు నాశనమయ్యాయన్నారు. దేశంలోనే అతిపెద్దదైన యుఎస్ శక్తి ఉత్పాదక ఎక్సాన్ మొబిల్తో పనిచేసే పిఎన్జి ఎల్ఎన్జి ప్రాజెక్ట్లో మరమ్మత్తులు కొనసాగుతున్నాయన్నారు. గ్యాస్ప్లాంట్ మూతపడటంతో ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడిందని ప్రధాన మంత్రి పీటర్ ఒ నైల్ వ్యాఖ్యానించారు.

Related Posts