YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

హరీష్ రావు...కార్ దిగి 'కమలం' పట్టేనా .?

Highlights

40 మందిఎమ్మెల్యేలతో బిజెపిలోకి చేరిక? 
రంగం సిద్ధమన్న వదంతులు..

గులాబీ మంత్రులల్లో గుసగుసలు  

హరీష్ రావు...కార్ దిగి 'కమలం' పట్టేనా .?

ఇటీవల  ఈశ్యాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  నాగాలాండ్,త్రిపురలలో కమలం వికసించడంతో ఇప్పుడు కమలనాధుల కన్ను గులాబీనేతలపై పడింది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయడానికి ఇప్పటినుంచే పావులు కదుపుతున్నట్టు వినికిడి. అందులో భాగంగానే వ్యూహాలు పన్నడంలో దిట్ట కమలనాధుల చీఫ్ అమిత్ షా కార్యాచరణను రూపొందించినట్టు సమాచారం. ఈ క్రమంలో తెరాసాలో కీలకమైన నేత హరిష్ రావునే టార్గేట్ చేశారన్న ఉహగానాలు పెద్ద ఎత్తున  వినిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రి పదవిలో  ఉన్న హరిష్ రావు పరిస్థితి మంగాలేని కక్కలేని చందంగా ఉందని చేప్పకనే చేప్పవచ్చు. అతని అసంతృప్తిని  అసరాగా చేసుకోనే  తెలంగాణలో కాషాయ జేండానే రెపరెపలాడించటానికి ఎత్తుకు పైయెత్తులను  సైతం చిత్తూ చేసే తరహాలో ఓ చక్కటి  పధకాన్ని రచించినట్టుగా ఆ పార్టీవర్గాల కధనం. హరీష్ రావు  బిజేపి చేరేపక్షఎంతో  ఆయనతో పాటుగా  దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు కూడా తెరాసను వీడి కాషాయం కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కరీంనగర్ కి చేందిన పలువురు ఎమ్మెల్యేలే ఎక్కువ ఉన్నారని గుసగుసలు వివస్తున్నాయి. అందుకే ఇటివలి కాలంలో బిజేపిపైనా, కేసీఆర్  ప్రధాని  మంత్రి మోడిపైనా కేసీఆర్ ఒక పక్క విమర్శలు చేస్తూంటుంటే మరో పక్క కేటీఆర్, కవితలు క్లారిటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో హరిష్ రావు పెద్దగా పట్టించుకోకపోవడం ఈ గుసగుసలు బలంచేకూరుతుంది. ఈ నేపథ్యంలో  అంతేకాకుండా తన ఫోన్లను  ట్యాపింగ్ నడుస్తున్నాయని సన్నిహితుల వద్ద హరీష్ రావు  వాపోతున్న సందర్భాలు లేకపోలేదు.  చరిత్ర చెపుతున్న సత్యాం కుడా అదే .ఇప్పుడు కాకున్నా రాబోవు రోజుల్లో పరిణమాం ఇంచుమించు  ఇదే అని చెప్పవచ్చు. తెరాసని చిత్తు చేయ్యలంటే ఒక్క  హరిష్ రావు సరైన హస్త్రమన్న యోచనలో  బిజేపి ఉన్నట్టు  సోషల్ మీడియాలో కధనాలు వైరల్ అవుతున్నాయి. నిజమేటో వాళ్ళిద్దరికే ఎరుక. అయితే గతంలో ( వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ) కూడా హరీష్ రావు  కాంగ్రెస్ పార్టీ చేరుతున్నట్టు గుసగుసలు వెలువడ్డాయి. అప్పుడు తెరాస అధికారంలో లేదు.. కానీ ఇప్పుడు ఆ పార్టీ అధికారాన్ని చెలాయిస్తోంది. అయితే హరీష్ రావు మాత్రం సంతృప్తిగా లేరన్నది వాస్తవం. ఏదిఏమైనా   మళ్ళీ ఇన్నాళ్లకు పార్టీ జంప్  వార్తలు వస్తున్నాయి.  


 

Related Posts