
పనిమనిషిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ జాతీయ దినపత్రిక జర్నలిస్టుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 4న అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో తన గదిలో నిద్రపోతున్న 25 ఏళ్ల యువతిపై జర్నలిస్ట్ అత్యాచార యత్నానికి పాల్పడ్డినట్టు గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. నిందితుడి ఇంట్లో ఆమె పూర్తిస్థాయి పని మనిషిగా ఉంటున్నట్టు పేర్కొన్నారు. 53 ఏళ్ల నిందితుడిపై గురువారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.