YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

శ్రీలంకలో చెలరేగిన  హింస 

Highlights

  • మైనార్టీ వర్గీయులపై మెజార్టీ వర్గీయుల దాడులు
    క్యాండీ నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నగొడవలు
  • ఎమర్జన్సీ విధింపు
  • మంత్రి దిస్సనాయకే  వెల్లడి
శ్రీలంకలో చెలరేగిన  హింస 

శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. సెంట్రల్ శ్రీలంకలో అతి పెద్ద నగరమైన క్యాండీలో గత వారం రోజులుగా హింసాయుత ఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ప్రభుత్వం అలర్ట్ అయింది. లేట్ అయ్యేకొద్దీ పరిస్థితులు మరింత దిగజారుతాయనే అంచనాలతో ఎమర్జెన్సీ ని ప్రయోగించింది. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్... ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని మంత్రి దిస్సనాయకే మీడియాకు తెలిపారు.మైనార్టీ వర్గీయులపై మెజారిటీ వర్గాలకు చెందినవారు వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులు క్రమంగా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఏర్పడింది. 

Related Posts