YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

వరుస తప్పులతో ధోని

వరుస తప్పులతో  ధోని

భారత సీనియర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ వికెట్ల వెనుక ఎంత చురుగ్గా ఉంటాడో..? అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ క్రీజు వెలుపలికి వెళ్లడం ఆలస్యం.. రెప్పపాటులో బెయిల్స్‌ను ఎగరగొట్టి ఇప్పటికే చాలా సార్లు క్రికెట్ ప్రపంచాన్ని ధోనీ ఆశ్చర్యపరిచాడు. కానీ.. ఇంగ్లాండ్ వేదికగా తాజాగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌లో తడబడుతున్న ధోనీ.. వికెట్ కీపింగ్‌లోనూ తప్పిదాలకి పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. వరల్డ్‌కప్ లీగ్ దశ మ్యాచ్‌లు శనివారం ముగియగా.. ఒక్క ఇంగ్లాండ్‌పై మినహా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాల్ని అందుకున్న టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కి సిద్ధమవుతోంది. న్యూజిలాండ్‌తో మాంచెస్టర్ వేదికగా మంగళవారం మధ్యాహ్నం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఢీకొననుండగా.. ధోనీ కీపింగ్ తప్పిదాలు లెక్కలతో సహా తాజాగా బహిర్గతమయ్యాయి. ప్రపంచకప్‌ లీగ్ దశలో పేలవ బ్యాటింగ్‌తో నిరాశపరిచిన ధోనీ.. 44.60 సగటుతో 223 పరుగులే చేశాడు. ఇందులో ఒకే ఒక అర్ధశతకం ఉంది. దీంతో.. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాలని ఇటీవల అభిమానులు డిమాండ్ చేశారు. బ్యాటింగ్‌లోనే కాదు.. కీపింగ్‌లోనూ ధోనీ నిరాశపరిచాడు. ఎంతలా అంటే.. ఈ వరల్డ్‌కప్‌లో ఏకంగా 24 పరుగుల్ని బైస్ రూపంలో ప్రత్యర్థులకి ధోనీ ఇచ్చేశాడు.
తాజా ప్రపంచకప్‌లో ఈ తరహాలో ఏ వికెట్ కీపర్ కూడా ధారాళంగా బైస్ ఇవ్వలేదు. ధోనీ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా కీపర్ అలెక్స్ క్యారీ 9 పరుగులతో ఉండగా.. ఇంగ్లాండ్, వెస్టిండీస్ కీపర్లు జోస్ బట్లర్, షైహోప్ 7 పరుగులు, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ కీపర్లు టామ్ లాథమ్, ముష్ఫికర్ రహీమ్ ఆరు పరుగులతో ఉన్నారు.

Related Posts