
బద్వేలు
కడప గడప లో ఈనెల 27 28 29 తేదీల్లో నిర్వహించే తెలుగుదేశం పార్టీ మానాడులో ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి తెలుగుదేశం పార్టీ చావు దెబ్బ కొట్టింది మిత్రపక్షలతో కలిసి మట్టి కరిపించింది ఇది రాష్ట్రంలోనే సంచలనంగా మారింది ఇక జగన్ కోటలో మహానాడు ను కనీవిని రీతిలో జరిపేందుకు ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డలో మహానాడు ను భారీ సక్సెస్ చేసి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం కోసం టిడిపి అడుగులు వేస్తుంది రాష్ట్రంలో ఇతర జిల్లాలో నిర్వహించిన మహానాడు ఒక ఎత్తు అయితే కడపలో నిర్వహించే మహానాడు ఒక ఎత్తు అవుతుంది అందుకు మహానాడు భారీ సక్సెస్ చేసేందుకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కార్యక్రమానికి నాలుగు రోజులు ముందు కడపలో మకాం వేసి దగ్గర ఉండి ఏర్పాట్లు చూడబోతున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మహానాడు ఉమ్మడి కడప జిల్లాలో టిడిపి ఆవిర్భావం నుంచి 2004 ముందు వరకు టిడిపి మెజార్టీ శ్రేణులు గెలుస్తూ వచ్చారు కడప బద్వేలు జమ్మలమడుగు ఇలా కొన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా అయితే 2004 తరువాత పరిస్థితులు మారాయి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బాగా పుంజుకుంది ఉమ్మడి కడప జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వైసిపి చతికిల బడింది ఆ పార్టీ అపజయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది ఆ షాక్ నుండి వైసిపి కోలుకోలేక పోతుంది ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కోటలో తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున మహానాడు నిర్వహిస్తుంది కడపలో మహానాడు నిర్వహించి రాయలసీమ అభివృద్ధికి పాటు కడప జిల్లా అభివృద్ధికి ప్రత్యేక రోడ్డు మ్యాప్ తయారుచేసి అటు పరిశ్రమలు ఇటు వ్యవసాయం కడపకు వచ్చే భారీ పరిశ్రమల గురించి మహానాడులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతారని పార్టీ నాయకులు అంటున్నారు వైజాగ్ చెన్నై పాలశ్రామిక కారిడార్లో భాగంగా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్నారు ఇది పూర్తయితే పరిశ్రమలు క్యూ కడతాయి ఇప్పటికే కొప్పర్తిలో పలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.
ఉక్కు పై ముందుకు
ఇక కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జిల్లా వాసుల చిరకాల కోరిక అయితే మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తామని జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టారు ఐదు సంవత్సరాలు పూర్తయ్య సరికి కనీసం ప్రహరీ గోడ కూడా నిర్మించలేకపోయారు కాగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు జిందాల్ తోనే నిర్మాణం చేపడుతుందని అంటున్నారు దీంతో మహానాడు ను విజయవంతం చేసి తెలుగుదేశం పార్టీలో మరింత జోష్ నింపాలని భావిస్తున్నారు ఇందుకుగాను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాలుగు రోజులు ముందుగానే కడపలో తిష్ట వేసి అందరిని సమన్వయం చేసుకుంటూ ఏర్పాటు పర్యవేక్షించినట్లు పార్టీ వర్గాలు తెలిపారు.
నేడు భూమి పూజ
కడప నగర శివారులో పబ్బాపురం ఉన్న 120 ఎకరాల్లో ఉపాధ్యాయుల లేఅవుట్లో మహానాడు నిర్వహిస్తున్నారు ఇప్పటికే పనులు మొదలుపెట్టారు అయితే నేడు స్టేజి కోసం ఇతర నిర్మాణాల కోసం నేడు భూమి పూజ చేస్తున్నారు ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జ్ మంత్రి సవిత తో పాటు రాయలసీమకు చెందిన పలువురు మంత్రులు వస్తున్నారు భూమి పూజకు రావాల్సిందిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను ఆహ్వానించినట్టు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు మహానాడు లేఅవుట్ తయారుచేసి ఎక్కడెక్కడ స్టేజి ప్రతినిధుల సమావేశం కోసం ఏర్పాటు చేసే మీటింగ్ సమావేశ మందిరాలు గ్యాలరీ పార్కింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస వసతి భోజనశాలలు వీఐపీలకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు రక్తదాన శిబిరం ఫోటో ఎగ్జిబిషన్ తదితరాలు ఏర్పాట్లు చేస్తున్నారు.
చరిత్రలో నిలిచేలా మహానాడు
డిసిసిబి చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి కడపలో నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడు చరిత్రలో నిలిచేలా ఉంటుందని డిసిసిబి చైర్మన్ మంజూరు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు చివరి రోజున ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఉంటుందని ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో స్టీలు ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయడమే తప్ప దాన్ని పూర్తి చేయలేదు జిందాల్తో స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి చేస్తాం ఒప్పందం కూడా జరిగిపోయింది కడప జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక డిక్లరేషన్ ను మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారు మహానాడు సక్సెస్ తో వైసిపి కోలుకోని విధంగా మారుతుంది.
కడపలో
ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగబోయే మహానాడు కార్యక్రమం కోసం చేపట్టిన ఏర్పాట్లలో భాగంగా, నేడు పోలిట్ బ్యూరో సభ్యులు జిల్లా అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి చింతకొమ్మదిన్నె మండలంలోని పబ్బాపురం గ్రామం సమీపంలో మాహానాడు మైదాన అభివృద్ధి పనులను పరిశీలించారు. భూమి పూజ అనంతరం వేగంగా కొనసాగుతున్న ఏర్పాట్లు మహానాడుకు విశేషంగా సిద్ధమవుతున్నాయి. అంతేగాక, కడపలో నిర్మాణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాలయ భవనాన్ని కూడా సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు.