YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

రక్తం కారుతున్న దేశం కోసం..

 రక్తం కారుతున్న దేశం కోసం..

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో: 

బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు ఆలెక్స్ క్యారీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఎనిమిదో ఓవర్‌ చివరి బంతి క్యారీ హెల్మెట్‌ నుంచి దూసుకుపోయి దవడ ముందు భాగానికి బలంగా తాకింది. దీంతో అతనికి తీవ్ర గాయమై.. రక్తం కూడా కారింది. వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా మెడికల్ సిబ్బంది మైదానంలోకి వచ్చి.. అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే రిటైర్డ్ హర్ట్‌గా క్యారీ మైదానం నుంచి తప్పుకోకుండా.. బ్యాండ్ ఏయిడ్ ధరించి ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నాడు.

Related Posts