
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గ్యాంగ్స్టర్ నయీం తల్లి తాహెరా బేగంను భువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నందున అరెస్టు చేశామని భువనగిరి పట్టణ సీఐ సురేందర్ వివరించారు. భూకబ్జాలు, బెదిరింపులు, కిడ్నాప్లు, మోసాలతోపాటు పలు నేరాలకు ఆమె పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆమెపై మొత్తం 12 కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. 18 భూ అక్రమ కేసుల్లలో తాహెరా బేగం నిందితురాలని పోలీసులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా కుంట్లూరు లో ఆమె నివాసంనుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.