
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
గ్యాంగ్ స్టర్ నయీం బంధువులు, అనుచరులపై నమోదయిన కేసుల పై డిసిపి నారాయణరెడ్డి మీడియా కు వివరణ ఇచ్చారు. బుధవారం అయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డీసీపీ మాట్లాడుతూ భువనగిరి జోన్ పరిధిలో నయీం అనుచరులు మీద నూట తొంబై కేసులు ఇప్పటి వరకు నమోదు అయ్యాయి. మూడు నెలల్లో 19 కేసులలో పాహిమ్, అబ్దుల్ నాసిర్ ,ప్రతాపరెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, సలీమ్, అయేషా బేగం, సహదేవ్, కత్తుల జంగయ్య లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని అన్నారు. నయీమ్ తల్లి తహెరాబేగం కు వున్న 87 ఎకరాల భూమి, మూడు షాపులను అక్రమంగా ఆస్తులను గుర్తించి కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు డీసీపీ తెలిపారు. ఇంకా ఎవరైనా నయీం బాధితులు ఉంటే పోలీసుల కు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాo. నయీమ్ అక్రమ ఆస్తుల క్రయవిక్రయాలు ఎవరైనా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నయీం అనుచరుడు పాశం శ్రీను పై 109 కేసులు నాజర్ పై 91 కేసులు నమోదు చేశాముని అయన అన్నారు.