
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఈ ఉదయం గవర్నర్ ను కలిసి, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరిన యడ్యూరప్ప అనంతరం మీడియాతో మాట్లాడారు. నేటి మధ్యాహ్నం 12.30 గంటలకు కర్ణాటక కొత్త సీఎంగా తాను ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం కుదిరిందని బీఎస్ యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పతనం కావడం వెనుక బీజేపీ ప్రమేయముందని వస్తున్న విమర్శలు అర్థరహితమని వ్యాఖ్యానించారు.