
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అసోంలో భారీ వర్షాలు, వరదల కారణంగా కాజిరంగా పార్కు 90శాతానికి పైగా నీట మునిగింది. అయితే ఇప్పటి వరకు వరుదల కారణంగా 208 మూగజీవాలు ప్రాణాలు పోయాయి. భారీ వరదల నుంచి తప్పించుకోవడానికి బయటకు వచ్చిన కొన్ని జంతువులు ప్రమాదవశాత్తూ మృతి చెందగా.. మరికొన్ని పార్కులోనే వరదల్లో మునిగి మృత్యువాత పడ్డాయి. వీటిలో 18 ఖడ్గమృగాలు, 167 జింకలు, ఒక ఏనుగుతో పాటు మరికొన్ని జీవులు ఉన్నాయి. వరదల ఉద్ధృతి ఇంకా కొనసాగుతుండడంతో వాటిని రక్షించేందుకు ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. అయితే వాటికి ఆహారం అందించడం పెద్ద సమస్యగా పరిణమించింది. కొన్ని మూగజీవాలు ఆహారం కోసం జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆహార కొరత, మురుగు నీరు కారణంగా పార్కులోని జంతువులన్నీ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి.