
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చే ప్రసక్తే లేదని మాజీ సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు. గత వారంలో విశ్వాస పరీక్షను ఎదుర్కొని, అందులో విఫలమై, సీఎం పదవికి రాజీనామా చేసిన కుమారస్వామి, తమ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతివ్వాలని వత్తిడి తెస్తున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించారు. యడియూరప్ప ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతివ్వాలని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారని జనతాదళ్ నేత జీటీ దేవెగౌడ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వార్త తనకు తెలిసిందని, ఇది నిరాధారమని, పార్టీ నేతలు ఎవరూ ఈ రూమర్స్ ను నమ్మవద్దని కుమారస్వామి వ్యాఖ్యానించారు.