
‘గోల్డెన్ బాబా’గా చిరపరిచితమైన సుధీర్ మక్కర్ మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరుగుతున్న 26వ కన్వర్ యాత్రకు 16 కిలోల బంగారు ఆభరణాలు ధరించి హాజరయ్యారు. నిజానికి ఆయన 20 కిలోల ఆభరణాలు ధరిస్తారు. అయితే, ఆరోగ్య కారణాల వల్ల ఈసారి నాలుగు కిలోలు తగ్గించారు. ఈ నెల 21న ఢిల్లీలో కన్వర్ యాత్రను ప్రారంభించినట్టు గోల్డెన్ బాబా తెలిపారు. గత 25 ఏళ్లుగా కన్వర్ యాత్రలో తాము పాల్గొం