
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కన్నడనాట కమలనాథులు బల పరీక్షలో నెగ్గిన కాసేపటికే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డికి సమర్పించారు. రమేశ్ కుమార్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయానికి సభలోని సభ్యులందరూ షాక్‌కు గురయ్యారు. రాజీనామా పత్రాన్ని ఇచ్చిన అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఇప్పటి నుంచి తాత్కాలిక స్పీకర్‌గా కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని సాయంత్రం 5గంటలకు వాయిదా వేశారు.