YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఆ ఇమేజ్‌కి తగ్గ అద్భుతమైన కథ..

ఆ ఇమేజ్‌కి తగ్గ అద్భుతమైన కథ..

రవితేజ, రాశీఖన్నా, సీరత్‌ కపూర్‌ హీరో, హీరోయిన్లుగా విక్రమ్‌ సిరికొండ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'టచ్‌ చేసి చూడు'. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్‌(బుజ్జి), వల్లభనేని వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'అతి త్వరలో సినిమాను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ వారంలోనే ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహిస్తాం. సినిమాలోని ఒక్కో పాటను సోషల్‌ మీడియాలో విడుదల చేస్తున్నాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. రవితేజ చాలా స్టయిలీష్‌గా కనిపిస్తున్నారని సర్వత్రా అందరూ ప్రశంసిస్తున్నారు. మాకు చిరకాల మిత్రుడైన రవితేజతో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్‌ మహారాజా ఇమేజ్‌కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేశారు. చూసిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుంది' అని అన్నారు.

Related Posts