
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. షోలాపూర్ లోని పుష్యలోక్ అహల్యదేవి హోల్కరీ యూనివర్శిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జాతీయగీతాన్ని ఆలపిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయన కుర్చీలో కూలబడిపోయారు. వెంటనే ఆయనకు ప్రాథమిక పరీక్షలను నిర్వహించిన డాక్టర్లు ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. గొంతు సంబంధిత వ్యాధితో గడ్కరీ బాధపడుతున్నారు. దీంతో ఆయన యాంటీబయోటిక్స్ వాడుతున్నారు. వాటి డోస్ ఎక్కువ కావడంతో ఇబ్బంది తలెత్తిందని డాక్టర్లు తెలిపారు.