
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అయోధ్య భూవివాదంపై ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ ప్యానెల్ విఫలమైనట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. అయోధ్య సమస్యపై మధ్యవర్తలు గడువులోగా ఎటువంటి పరిష్కారాన్ని సూచించలేకపోయినట్లు కోర్టు చెప్పింది. ఇక ఆగస్టు 6వ తేదీ నుంచి అయోధ్య అంశంపై రోజువారిగా వాదనలు కొనసాగనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మధ్యవర్తులు ఎటువంటి సెటిల్మెంట్ చేయలేకపోయినట్లు చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ తెలిపారు. ముగ్గురు సభ్యుల మధ్యవర్తుల ప్యానెల్ ఈ సమస్యపై అన్ని వర్గాలను ఏకం చేసేందుకు ప్రయత్నించింది, కానీ కొన్ని వర్గాలు వారి ప్రతిపాదనలకు అంగీకరించలేదని తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ 17వ తేదీన చీఫ్ జస్టిస్ రిటైర్‌కానున్నారు. ఈ లోగానే ఈ సమస్యపై తుది తీర్పును ఇ్వవానలుకున్నారు. ప్రస్తుతం అయిదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య భూవివాదంపై విచారణ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.