
వికారాబాద్ లోని మోతిబాగ్ కాలనీ పాత మహిళ పోలిస్ స్టేషన్ సమీపంలో అనుమానంతో భార్యపిల్లలను భర్త ప్రవీణ్ హతమార్చాడు. మృతులు భార్య చాందిని(30), కుమారుడు ఆయన్(10), కూతురు ఏంజిల్(5). చాందిని ఒక ప్రవేటు స్కూల్ లో టిచర్ గా గా పని చేస్తుంది. భర్త ప్రవీణ్ ప్రవేటు జాబ్ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రవీణ్ స్వగ్రామం తాండూరు కాగ వారి కుటుంబం హైదరాబాద్ లోని లింగపల్లిలో నివాసం ఉంటుంది. ఇంటి పక్కనే చాందిని కుటుంబం నివాసం ఉండటంతో వేరువేరు కులాలు ఐనా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. చాందినికి అంతకు ముందే వేరే వ్యక్తితో వివాహం జరిగి ఒక కుమారుడు ఉన్నారు. ప్రవీణ్ తో వివాహం తర్వాత ఓ పాప జన్మించింది. ఇద్దరు పిల్లలతో కలిసి వికారాబాద్ లోని మోతి బాగ్ కాలనిలో అద్దెకు ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా భార్య పై అనుమానంతో ఇద్దరు గొడవ పడేవారు. రాత్రి కూడా ఇదే విషయమై గొడవ జరిగి భార్య ఇద్దరు పిల్లలను రాడు తో కొట్టి చంపిని ప్రవీణ్ పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు.