YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌పై రూ.40 సర్వీస్ చార్జ్

ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌పై రూ.40 సర్వీస్ చార్జ్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

రైల్వే ప్యాసింజర్లకు అలర్ట్. ఇ-టికెట్ల ధరలు పెరగనున్నాయి. ఐఆర్‌సీటీసీ ద్వారా కొనుగోలు చేసిన ట్రైన్ టికెట్ల ధరలు ఇప్పుడు మరింత పెరగనున్నాయి. ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఫీజు చార్జీలను మళ్లీ విధించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రైల్వే ప్రయాణికులపై భారం పడనుంది. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు ఇండియన్ రైల్వేస్ ఈ చార్జీలను తొలగించి ఇప్పటి మూడేళ్లు అయిపోయింది. మళ్లీ ఇప్పుడు వీటికి విధించాలని నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. దీంతో ఐఆర్‌సీటీసీ ఇకపై ఆన్‌లైన్‌లో టికెట్లను బుకింగ్ చేసుకుంటే సర్వీస్ చార్జ్‌ను వసూలు చేస్తుంది.
ఇకపోతే సర్వీస్ చార్జీ ఎత్తివేత తర్వాత ఇండియన్ రైల్వే టికెటింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఐఆర్‌సీటీకీ 2016-17లో ఇంటర్నెట్ టికెటింగ్ రెవెన్యూ 26 శాతం తగ్గింది. ఐఆర్‌సీటీసీకి ఏకంగా రూ.88 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని భరించేందుకు ఆర్థిక శాఖ సన్నద్ధంగా లేనందున సర్వీస్ చార్జీ పెంపును సూచిస్తూ్.. ఈ శాఖ రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.
ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్‌పై రూ.40 వరకు చార్జీ వసూలు చేస్తుంది. ప్రతి నాన్ ఏసీ ఇటికెట్‌ బుకింగ్‌కు రూ.20, ప్రతి ఏసీ టికెట్ బుకింగ్‌కు రూ.40 సర్వీస్ చార్జ్ వసూలు చేస్తుంది. ఈ చార్జీలను ఇలాగే కొనసాగించాలా? లేక పెంచాలనే అనే నిర్ణయం ఐఆర్‌సీటీసీదే.

Related Posts