YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

అనారోగ్యంతో సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ రెడ్డి మృతి

అనారోగ్యంతో సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ రెడ్డి మృతి

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తుగ్గలి మండల పరిధిలోని ఆర్ఎస్ పెండేకల్లు గ్రామంలో సిపిఐ సీనియర్ నాయకుడు నారాయణ రెడ్డి (85) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. ఈయన చదువుల రామయ్య తో కలిసి జి ఎర్రగుడి,మదనంతపురం,బొమ్మనపల్లి, బొందిమడుగుల,నునుసరాళ్ళ,మారెళ్ళ,ఆర్ఎస్ పెండేకల్లు గ్రామాలలో భూ పోరాటాలు చేసి 1972 లో కోసిగి దొరలపై భూ పోరాటాలు చేసి, జైలు శిక్ష అనుభవించి సాధించిన భూములను గిరిజన దళితుల కుటుంబాలకు అందజేసిన నాయకుడు నారాయణరెడ్డి.అదేవిధంగా ఆయన చేసిన సేవలను మననం చేసుకుని ఆయనకు నాయకులు నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య,జిల్లా కార్యదర్శి గిడ్డయ్య,జిల్లా కార్యవర్గ సభ్యులు నబి రసూల్,గురుదాస్, మండల కార్యదర్శి రోల్లపాడు వెంకటేష్,మాబు పీరా,సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts