
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దేశ వ్యాప్తంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా వీర్ భూమి వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాజీవ్ గాంధీకి ఆయన సతీమణి సోనియాగాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, తనయుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ అంజలి ఘటించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆజాద్, అహ్మద్ పటేల్, నేతలు కూడా రాజీవ్ గాంధీ స్మృతి సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ చేసిన సేవలను నేతలు స్మరించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్టర్ ద్వారా రాజీవ్ కు నివాళులర్పించారు. 1984 నుంచి 1989 వరకు ప్రధానిగా రాజీవ్ దేశానికి అందించిన సేవలను అయన కొనియాడారు.