Highlights
- ఉదయం 9 .30 గంటలకు మొదలు
- సాయంత్రం 4 గంటలకల్లా క్లోజ్
- లంచ్ విరామానికి గంటకు పెంచారు.

అసెంబ్లీ వేళలను మార్చాలని ఆ ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తిని గుజరాత్ రాష్ట్ర శాసనసభాపతి రాజేంద్ర త్రివేదీ మన్నించారు.ప్రత్యేకించి మధుమేహ బాధిత ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీ వేళలను మారుస్తున్నట్టు ప్రకటించారు.అంతేగాకుండా మధుమేహ ఎమ్మెల్యేలందరికీ వారు తీసుకునే ఆహారాన్నే అందించేలా అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని సూచించారు. మార్చిన వేళల ప్రకారం అసెంబ్లీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇంతకుముందు 8.30 గంటలకే అసెంబ్లీ ప్రారంభమయ్యేది. ఇప్పుడు మార్చిన వేళల ప్రకారం గంట ఆలస్యంగా ప్రారంభం కానుంది. సమావేశాల రోజులు కాకుండా మిగతా రోజుల్లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవ్వాల్సిన సభ.. ఇకపై 11 గంటలకే ప్రారంభం కానుంది. మరోవైపు ఉదయమే లేచి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సభకు ప్రిపేర్ అయ్యేలా 4.00 గంటలకే సమావేశాలను ముగించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక, మధ్యాహ్న భోజన సమయాన్ని మధుమేహ ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకుని ఓ పదిహేను నిముషాలు పెంచారు. ఇప్పటిదాకా లంచ్ విరామానికి 45 నిముషాలే కేటాయించినా.. ఇప్పుడు గంటకు పెంచారు.