YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

రాష్ట్రపతి పురస్కారానికి ఏపీ విద్యార్థినీలు ఎంపిక 

Highlights

  • దివిసీమ విద్యార్థిని ప్రియాంకకు ప్రశంసలు
  •  19న డిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం 
రాష్ట్రపతి పురస్కారానికి ఏపీ విద్యార్థినీలు ఎంపిక 

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీవిష్ణు ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో ప్రియాంక మూడో సంవత్సరం బీటెక్ (ఈసీఈ) విద్యార్థినీలు  తయారు చేసిన పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ పురస్కారాల కోసం దేశ వ్యాప్తంగా 3 నుంచి 4 వేల మంది వారు తయారు చేసిన ప్రాజక్టులను పంపించగా అందులో kevalam 43 మందికి చెందిన ప్రాజెక్ట్స్ ఎంపికయ్యాయి. ఇందులో గాంధీయన్ యంగ్ టెక్నాలాజికల్ ఇన్నోవేషన్ సంస్థ జాతీయ స్థాయిలో నిర్వింహించిన పోటీ పరీక్షకు ఈసీఈ విద్యార్థినీలు దివిసీమ ప్రాంతానికి చెందిన పంచకర్ల సేవ్య  నాగప్రియాంక మరో ముగ్గురు తోటి విద్యార్థినులతో కలిసి తయారు వినికిడి పరికరం ఎంపిక కావడం విశేషం. వినికిడి లోపం ఉన్న వారికి ఏదైనా ఆపద వస్తే సహాయం కోసం ప్రియాంక మరో ముగ్గురు విద్యార్థినులు ఒక పరికరాన్ని తయారు చేశారు. చేతి వాచ్ లా  ఉండే ఈ పరికరం బటన్ నొక్కితే అదే పరికరం ఉన్న వారందరికి ఆవ్యక్తి ఆపదలో ఉన్నట్లు తెలిసి వెంటనే స్పందించి సహాయపడే అవకాశం ఉంటుంది. ఈ పరికరం మార్కెట్లో రూ.15వేలు పైగా ఉండగా వీరు తయారుచేసిన పరికరం ఖరీదు రూ.500 మాత్రమేనని చెప్పింది. ఈ పరికరం రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైంది. ఈనెల 19న దిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రియాంక బృందం పురస్కారం అందుకోనుంది. ఈ పురస్కారం అందుకున్న అనంతరం మరో రౌండు పోటీ కూడా ఉంటుందని, అందులో కూడా విజయం సాధిస్తే రూ.15 లక్షలు నగదు పురస్కారం వస్తుందని సేవ్య తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహమే ప్రియాంక తండ్రి పంచకర్ల సుబ్రహ్మణ్యం మోటారు సైకిల్ మెకానిక్. తల్లి రజినీకుమారి గృహిణి. వారికి ఇద్దరు ఆడ పిల్లల్ని (కవలలు). రజినీకుమారి బీఎస్సీ ఆఖరి సంవత్సరంలో ఉండగా వివాహమై చదువు ఆగిపోగా, ఆ తర్వాత ఆమె ప్రైవేటుగా డిగ్రీ, బీఈడీ, ఎమ్మెస్సీ (బాటనీ) పూర్తి చేశారు. ఆమె పిల్లల్ని చిన్నప్పటి నుంచి బాగా ప్రోత్సహిస్తూ చదివించింది. ప్రస్తుతం వారు ఇంజినీరింగ్ మూడో సంవత్సం చదువుతున్నారు. కుమార్తె రాష్ట్రపతి పురస్కారానికి ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, ఆమె సోదరి నేవ్య నాగప్రియ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts