YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

40 బార్డర్ పోస్టులపై పాక్ కాల్పులు.. ఇద్దరు మృతి

40 బార్డర్ పోస్టులపై పాక్ కాల్పులు.. ఇద్దరు మృతి

నియంత్రణ రేఖ వెంట మరోసారి పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన

పాకిస్థాన్ హద్దులమీద హద్దులు మీరుతూనే ఉంది. ఎన్నిసార్లు భారత్ బుద్ధి చెప్పినా తన పద్ధతి మాత్రం మార్చుకోవట్లేదు. అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంట మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ తూట్లు పొడిచింది. శుక్రవారం తెల్లవారు జామున జమ్మూ, సాంబ జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతిచెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బార్డర్ అవుట్ పోస్టులనే లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులకు పాల్పడిందని, పాకిస్థాన్ రేంజర్లు ఆర్ఎస్ పురా, ఆర్నియా, రామ్‌ఘర్ సెక్టార్లలో ఉదయం 6.40 గంటలకు కాల్పులకు తెరలేపారని ఓ బీఎస్ఎఫ్ అధికారి చెప్పారు. మూడు సెక్టార్లలోని 40 బార్డర్ అవుట్ పోస్టులపై (బీఓపీ) 82 ఎంఎం, 52 మోర్టార్ బాంబులు ప్రయోగించారని, ఆటోమేటిక్ ఆయుధాలతో దాడులు చేశారని వివరించారు. 35 కిలోమీటర్ల పొడవునా బీవోపీ, సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా పాకిస్థాన్ కాల్పులకు పాల్పడిందని, ప్రస్తుతం పాక్ కాల్పులకు దీటుగా భారత బలగాలు జవాబిస్తున్నాయని చెప్పారు. మరోవైపు పాక్ కాల్పులతో అల్లకల్లోలంగా మారిన సరిహద్దు గ్రామాల నుంచి స్థానికులు వలస బాట పట్టారని అధికారులు చెబుతున్నారు. 

Related Posts