YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసారు పోటీ శిబిరాలతో జగన్ చేతగాని తనం

ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసారు పోటీ శిబిరాలతో జగన్ చేతగాని తనం

 

ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాసారు
పోటీ శిబిరాలతో జగన్ చేతగాని తనం
పోలీసులు, లాఠీలతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని అడ్డుకోలేరు
విజయవాడ సెప్టెంబర్ 11,

మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమాను మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో హౌస్ అరెస్ట్ చేసారు. తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు చలో ఆత్మకూరు కార్యక్రమానికి ఉమా వెళ్లకుండా పోలీసులు గృహ నిర్భంధం చేసారు. ఈ విషయం తెలిసి గురువారం ఉదయం గొల్లపూడి ఆయన అద్దెకు ఉంటున్న గృహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తండోపతండాలుగా వచ్చారు. దేవినేని ఉమా అరెస్ట్ ను నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేసారు. ఈ సందర్భంగా దేవినేని మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ధోరణి అంబేడ్కర్ స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కుల్ని జగన్ ప్రభుత్వం కాలరాస్తుందని ధ్వజమెత్తారు. వందరోజుల ముఖ్యమంత్రి జగన్ చేతగాని ప్రభుత్వంలో పుట్టిపెరిగిన ఊళ్ళను ఒదిలేసి వందరోజులుగా పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న తెదేపా కార్యకర్తలకు, అభిమానులకు అండగా చలో ఆత్మకూరు కార్యక్రమం తలపెట్టినందున ప్రభుత్వం నాయకుల గృహనిర్భంధాలకు పాల్పడిందని ఆరోపిరంచారు. బాధితులకు న్యాయం చేయకుండా పోటీ శిబిరాలతో, శాంతి భద్రతలను ప్రభుత్వమే అల్లకల్లోలం చేస్తుందని ఆరోపించారు. పోలీసులు, లాఠీలతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని అడ్డుకోలేరని, ఆత్మకూరు బాధితులకు న్యాయం జరిగేదాకా తెదేపా ఉద్యమం ఆగదని దేవినేని ఉమా స్పష్టం చేసారు. పోరాటాలు, అక్రమ అరెస్టులు తెదేపాకు కొత్త కాదని, తనకు తెలియనివి కాదని ఉమా వివరించారు. 

Related Posts