YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ విదేశీయం

మంత్రి కేటీఆర్ తో అమెరికన్ దౌత్యాధికారి భేటీ

మంత్రి కేటీఆర్ తో అమెరికన్ దౌత్యాధికారి భేటీ

మంత్రి కేటీఆర్ తో అమెరికన్ దౌత్యాధికారి భేటీ
హైదరాబాద్ లోని  అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్ మాన్ పరిశ్రమలు, ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కెటి రామారావుతో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ రోజు మసాబ్ ట్యాంక్ లోని పురపాలక భవనంలో మంత్రిని కలిసిన అయన రెండోసారి మంత్రిగా పదవీ భాద్యతలు స్వీకరించినందుకు కెటియార్ కు కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ లో  ప్రస్తుతం ఉన్న అమెరికన్ పెట్టుబడులు, భవిష్యత్తు పెట్టుబడి అవకాశాలను ఇరువురు చర్చించారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ధీటుగా నగరం అభివృద్ధి పథంలో దూసుకుపొతున్నదని తెలిపిన కెటియార్ వివిధ రంగాల్లో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను వివరించారు. గత కాన్సుల్ జనరల్ క్యాథరీన్ హడ్డా బదిలీ అనంతరం నూతన కాన్సుల్ జనరల్ గా జోయల్ రీఫ్ మాన్ భాద్యతలు స్వీకరించారు. కాన్సుల్ జనరల్ తోపాటు కాన్సులర్ ఛీఫ్  ఏరిక్ అలగ్జాండర్, ఎకానమిక్ స్పెషలిస్ట్  క్రిష్టెన్ లోయిర్ లు మంత్రిని కలిసిన బృందంలో ఉన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లు కూడా ఉన్నారు.

Related Posts