YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

డ్వాక్రా మహిళలను నిలువునా ముంచిన బుక్ కీపర్

డ్వాక్రా మహిళలను నిలువునా ముంచిన బుక్ కీపర్

డ్వాక్రా మహిళలను నిలువునా ముంచిన బుక్ కీపర్
జోగులాంబ గద్వాల సెప్టెంబర్ 14,
చదువురాని డ్వాక్రా మహిళలను ఒక బుక్ కీపర్ నిలువునా ముంచిన వైనం ఇది. ఏకంగా నాలుగు సంవత్సరాలుగా  ఈ తతంగం జరిగినట్లు గుర్తించారు. వివరాలకు. వెళితే. జోగులంబ గద్వాల జిల్లా పరిధిలో ని గద్వాల మండలం లోని గోను పాడు గ్రామం లో 43 పైగా డ్వాక్రా మహిళా  సంఘాలు ఉన్నాయి.ఈ 43 సంఘాలకు గాను ఒకే.బుక్ కీపర్ ఉన్నాడు. .ప్రభుత్వం మహిళలకు సంఘాలు ఏర్పాటు చేసి వారికి తక్కువ.వడ్డీకి రుణాలు,రాయి తీలు అందజేస్తుంది..అలాగే గోను పాడు గ్రామంలో 43 సంఘాలు రుణాలు పొందారు.నెలవారిగా రుణం తీర్చడానికి బ్యాంకు కుపోలేని పరిస్థితి వారిది. నిరక్షరాస్యత. కారణం చేత ఇంకో వ్యక్తి  మీద ఆధారపడ్డారు. ఇదే అదునుగా భావించిన బుక్ కీపర్ జావేద్ మహిళల నిరక్షరాస్యత ను ఆసరాగా చేసుకొని గద్వాల్ కు శాంక్షన్ అయిన సర్వీసు సెంటర్ ను   షకీల్ అహ్మద్  బినామీ పేరుతో ఎస్బీఐ  సర్వీసు  సెంటర్ ను నడుపుతూ డబ్బులు ఇక్కడి నుండే కట్టవచ్చునని నమ్మబలికాడు. మహిళలు నెల నెల కడుతున్న డబ్బులను స్వాహాచేసాడు. బ్యాంక్  లోన్ పొందే క్రమము లో కూడా లీడర్లను సహితం బ్యాంకుకు  తీసుకుపోకుండా వారి సంతకాలు తీసుకొని  డబ్బులు  డ్రా చేస్తూ మోసలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  ఒక జాగృతి సంఘానికి 3.లక్షలు రుణం మంజూరు అవుతే బ్యాంకులో 2 .లక్షలు డ్రా చేసి మిగతా డబ్బులు బ్యాంకు వాళ్లు ఇవ్వడం లేదని బుక్ కీపర్ బ్యాంక్ .నమ్మబలికారని ఆరోపణలు ఉన్నాయి . మిగతా 42 సంఘాలలో కూడా భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఏసీబీ,ఇంటెలిజెన్స్  వారితో విచారణ చేపట్టాలని మహిళ సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts