YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

గోదావరిలో బోటు ప్రమాదం విషాదకరం

గోదావరిలో బోటు ప్రమాదం విషాదకరం

గోదావరిలో బోటు ప్రమాదం విషాదకరం
గుంటూరు సెప్టెంబర్ 16
దేవీపట్నం మండలం కచ్ఛులూరు వద్ద పర్యాటక బోటు గోదావరిలో మునిగి పలువురు మృతి చెందడం, ఇంకొందరు గల్లంతు కావడం విషాదకరమని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్  రాస్త్ర డైరెక్టర్ కారణం తిరుపతి నాయుడు ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆయన రాస్త్ర ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అమలు చేయాలని సూచించారు. పర్యాటక లాంచీలకు అనుమతి ఇచ్చే సమయంలో ఆయా లాంచీలో నిర్వాహకులు రక్షణ చర్యలు సక్రమంగా పాటిస్తున్నారా లేదా చూడాలని, లైఫ్ జాకెట్లు ప్రయాణికులకు సరిపడినన్ని అందుబాటులో ఉంచారా లేదా, కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారో లేదో చూసి లైసెన్సులు జారీ చేయాలని కోరారు. అలాగే గోదావరిలో నడిపే ప్రతి పర్యాటక బోటును ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, అనుమతుల్లేని బోట్లపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం గోదావరిలో జరిగిన లాంచీ ప్రమాదంలో గల్లంతయిన వారు సురక్షితంగా వారి కుటుంబాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. మృతి చెందిన కుటుంబాలకు 20 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని తిరుపతి నాయుడు డిమాండ్ చేశారు.

Related Posts