YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రక్షణ కవచాన్ని కాపాడదాం ప్రకృతితో మమేకమైతేనే పర్యావరణ సమతూల్యత మేల్కొంటేనే మనుగడ..!

రక్షణ కవచాన్ని కాపాడదాం ప్రకృతితో మమేకమైతేనే పర్యావరణ సమతూల్యత మేల్కొంటేనే మనుగడ..!

రక్షణ కవచాన్ని కాపాడదాం ప్రకృతితో మమేకమైతేనే పర్యావరణ సమతూల్యత
మేల్కొంటేనే మనుగడ..!
అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 
హైదరాబాద్, సెప్టెంబర్ 16
ఓజోన్ రక్షణ కవచాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అటవీ, పర్యావరణ, శాస్త్ర & సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. భూమిని అతినీల లోహిత కిరణాల నుంచి రక్షించే ఈ కవచాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని  మానవాళికి రక్ష ఓజోన్ గొడుగు ప్రాధన్యతను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గుర్తు చేశారు.  ఓజోన్ క్షీణిత జీవుల మనుగడకు ప్రమాద సూచిక అన్నది గుర్తించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కు పటిష్టమైన చర్యలు చేపడుతోందని ఈ సందర్బంగా తెలిపారు. ప్రకృతి సంపదను  కాపాడటంతో పాటు జల, వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తెలంగాణ ఉపిరి తిత్తులుగా పిలువబడే  నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వాకాలకు అనుమతినివ్వడం లేదని స్పష్టం చేశారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో భాగంగా  అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా  గత కొన్ని సంవత్సరాలుగా  కోట్లాది మొక్కలు నాటి పర్యావరణ సంరక్షణ చేపడుతోందని తెలిపారు. సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచేందుకు సీయం కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని విరించారు. పర్యావరణానికి హాని జరగకుండా.. గ్రీన్ బిల్డింగ్స్ లేదా గ్రీన్ హోమ్ల నిర్మాణాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. నిర్మాణ సంస్థలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తుందన్నారు. పర్యావరణ కాలుష్యం, పరిశ్రమల నుంచి వెలువడే విషపూరిత వాయువులను అదుపు చేయాడానికి కావాల్సిన అన్ని చర్యలను పీసీబీ తీసుకుంటుందని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించి, ప్రత్యమ్నాయ మార్గాలపై కాలుష్య నియంత్రణ నియంత్రణ మండలి దృషి పెట్టిందన్నారు. ఓజోన్ పొర దెబ్బతినడానికి మనం వాడే ఏసీలు, రిఫ్రిజరేటర్లు, కాస్మిటిక్, టాయిలెట్లకు వినియోగించే పదార్థాలే కారణమని, ఇలా క్లోరో ప్లూరో కార్బన్  లను ఉత్పత్తి చేసే వస్తువులను మితంగా వినియోగించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, అందరూ సమష్టిగా సహజ సిద్ధ సంపదను పరిరక్షించుకోవాలని కోరారు. లేదంటే మానవుడు కాలుష్య కోరల్లో చిక్కి అంతరించిపోయే ప్రమాదం ఉందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకం అయినప్పుడే పర్యావరణ సమతూల్యతను కాపాడుకోవచ్చని వివరించారు.

Related Posts