YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

ప్రతిఒక్కరికి టెక్నాలజీపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలి  -  జిల్లా ఎస్పీ సింధు శర్మ 

ప్రతిఒక్కరికి టెక్నాలజీపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలి  -  జిల్లా ఎస్పీ సింధు శర్మ 

ప్రతిఒక్కరికి టెక్నాలజీపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలి  -  జిల్లా ఎస్పీ సింధు శర్మ 
జగిత్యాల  సెప్టెంబర్ 17 
:రాష్ట్ర పోలీసు శాఖ టెక్నాలజీకి పెద్దపీట వేస్తుందని, ఇప్పుడు పలు రకాల యాప్స్ లతో సాంకేతికత ఆధారంగా పలు చిక్కుముడులు వున్న కేసులను సైతం పోలీసులు తేలుస్తున్నారని ప్రతి ఒక్కరికి టెక్నాలజీపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలని జగిత్యాల ఎస్పీ సింధు శర్మ పోలీసులకు సూచించారు.  మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లాఎస్పీ సింధు శర్మ వివిధ పోలీస్ స్టేషన్లలోని రైటర్లకు, కంప్యూటర్  అపరేటర్లకు పోలీస్ అప్లికేషన్లు, ఈ-కాప్,  ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ , ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ద్వారా వచ్చే ఫలితాలపై అవగాహన పెంపొందించడానికి ఒకరోజు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇక నుంచి ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్టులు ఆన్లైన్ లో కూడా తప్పనిసరిగా పంపాలని, ప్రతిఒక్కరు ఈ-కాప్ సాంకేతిక వ్యవస్థపై అవగాహన కలిగి యుండలి అని, శిక్షణలో నేర్చుకున్న అంశాలు విధులలో ప్రదర్శిస్తూ వేగవంతంగా సంపూర్ణ స్థాయిలో ఫలితాలు పొందేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.సాంకేతికతపై మంచి పట్టు చిక్కితే తీవ్రమైన నేరాలు చిక్కుముడులు విప్పడం సులభతరంగా మారుతుందన్నారు. టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర పోలీస్ శాఖ ఇప్పుడు పలు రకాల యాప్స్ లతో సాంకేతికత ఆధారంగా పలు  చిక్కుముడులు వున్న కేసులను సైతం పోలీసులు తేలుస్తున్నారన్నారు. ప్రతిఒక్కరికి టెక్నాలజీపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాలన్నారు. పోలీస్ స్టేషన్ ఫంక్షనల్ వర్టికల్ లోని వివిధ విభాగాలలో ప్రతిభ చూపిన వారికి రివార్డ్ లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సుధాకర్,  డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రరావు,  ఐటికొర్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ల రైటర్లు, టెక్ టీం సిబ్బంది పాల్గొన్నారు. 

Related Posts